అన్వేషించండి

జూలై 17 రాశిఫలం: ఈ రాశివారు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 17 సోమవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 17, 2023

మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో గొడవ జరిగే అవకాశం ఉంటుంది. తొందరపడి మాట తూలకండి. మీరు మీ సొంత పని కన్నా ఇతరుల పనిపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆ తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొంటారు.  మీరు చేసిన పాత పొరపాటు ఈరోజు బయటపడతాయి. 

వృషభ రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది తిరిగి పొందడం కష్టమవుతుంది. సోదరుల నుంచి సహాయం పొందుతారు. ప్రేమికులకు ఈ రోజు ఆహ్లాదరకరంగా ఉంటుంది. 

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికే విషయాల్లో జాగ్రత్త వహించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ చేయొద్దు.

Also Read: జూలై 16 రాశిఫలాలు, ఈ రాశివారు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోండి

కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోకుండా పెద్దమొత్తంలో డబ్బు అందుకునే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలి, భవిష్యత్ కోసం డబ్బులు ఆదాచేయాలి. ఈ రోజు మీరు వ్యాపార ప్రణాళికలో విజయం సాధిస్తారు. అవివాహితులకు ఇంకొంతకాలం ఒంటరి జీవితం తప్పదు

సింహ రాశి
ఈ రాశికి చెందిన రాజకీయనాయకులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. మీ అవసరాలకు ఖర్చులు చేస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. కుటుంబంతో కలసి టూర్లు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలపై ఆందోళన చెందుతారు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి. విపత్కర పరిస్థితుల్లో ఓపికగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. ఒకరి సలహాలు విని పెట్టుబడి పెట్టొద్దు నష్టపోతారు. అనుకోని సమస్యలు వచ్చినా జీవిత భాగస్వామి సహకారంతో పూర్తిచేస్తారు.

తులా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ కీర్తి మరియు గౌరవం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పిల్లల అవసరాలపై దృష్టి సారించండి. 

వృశ్చిక రాశి 
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు మంచి రోజు.  మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతుంటే ఈ రోజు మీ ఆందోళనలు తొలగిపోతాయి. సోదరులు, సోదరీమణుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వచ్చినా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఇంటి నిర్వహణ కోసం ఖర్చుచేస్తారు. మీ మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోండి. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగులు పనిపై మరింత అవగాహన పెంచుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదరవుతాయి. విద్యార్తులు పోటీ పరీక్షలకోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. 

Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!

మకర రాశి

ఈ రోజు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులుంటాయి. పరిమిత ఆదాయం కారణంగా ఖర్చు చేయడానికి వెనకాడతారు. ఆర్థిక స్థితిని పెంచుకునేందుకు చాలా కష్టపడతారు. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. 

కుంభ రాశి
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్తిని కొనాలన్నా అమ్మాలన్నా ఈ రోజు మీకు మంచి రోజు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి.  అధిక పని కారణంగా మీపై ఒత్తిడి పెరుగుతుంది. 

మీన రాశి
ఈ రాశి వ్యాపారులు ఈ రోజు వ్యాపారంలో పెద్ద లాభాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది. స్వల్ప ప్రయోజనాలకోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు శుభవార్త వింటారు. స్నేహితులు మీనుంచి సహకారం కోరి రావొచ్చు. ఉద్యోగులకు శుభసమయం.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget