అన్వేషించండి

జూలై 16 రాశిఫలాలు, ఈ రాశివారు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోండి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 16 ఆదివారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 16, 2023

మేష రాశి
ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కొత్తగా ఏపని ప్రారంభించినా అనుభవజ్ఞులైనవారి సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ కలహాలు సమసిపోతాయి. అనుకున్న పని పూర్తి అయినప్పుడు ఆనందం ఉంటుంది. పిల్లల తప్పుడు అలవాట్లను అంగీకరించవద్దు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు.

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిపై కొనసాగుతున్న ఆందోళన తొలగిపోతుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. కార్యాలయంలో అధికారుల వైఖరి ప్రతికూలంగా ఉంటుంది.

మిథున రాశి
అవసరానికి మించి ఖర్చు చేయకండి. పిల్లలతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈరోజంతా సరదాగా ఉంటారు. ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కుంటారు.  నిరాడంబరంగా ఉండండి. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోండి. శారీరక శ్రమ వల్ల అలసట ఉంటుంది. ఎవరికైనా సలహా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

Also Read: కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారికి ఆదాయం, పదోన్నతి!

కర్కాటక రాశి
పెద్దల సలహాతో మీ పనులు పరిష్కారం అవుతాయి. తెలివిగా ఖర్చు చేయండి. వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. పిల్లల విజయాలపై ఆనందంగా ఉంటుంది. దంపతులు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త వ్యాపారాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి.

సింహ రాశి
ఈ రోజు ఆదివారం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీరు చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాప పడతారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి  మార్గదర్శకత్వం నుంచి ప్రయోజనం పొందుతారు. మూఢనమ్మకాలతో డబ్బు వృధా చేయకండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

Also Read: వారఫలాలు జూలై 17 to 23: గడిచిన వారం కన్నా ఈ వారం ఈ రాశులవారి ఆర్థిక స్థితి బావుంటుంది!

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు ఎవరి కారణంగా అయినా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. తప్పులను ప్రోత్సహించవద్దు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక పనులకోసం ఖర్చు చేస్తారు. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తులా రాశి 
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. కుటుంబంతో సఖ్యత ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. మీ ప్రవర్తనను సరళంగా ఉంచండి.

వృశ్చిక రాశి
ఈ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత స్నేహితులను కలుస్తారు. ధనలాభం  పొందే అవకాశం ఉంది. ఈరోజు సంతోషకరమైన రోజు కానుంది. దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అప్రమత్తంగా ఉండండి. కర్మాగారాల్లో పనిచేసే వారు రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. 

Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!

ధనుస్సు రాశి

ఈ రాశివారు కొత్త అవకాశాలు పొందుతారు. తెలియని అడ్డంకి కారణంగా మీ పని ప్రభావితం కావొచ్చు. రహస్య శాస్త్రాలను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తారు. సురక్షితమైన ప్రయాణం చేయండి. మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను మరచిపోవచ్చు. ఈ రోజు మంచి రోజు కానుంది. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి.

మకర రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. కుటుంబంలో కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. సన్నిహితులను కలుస్తారు. మీ ప్రవర్తన బాగుంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. 

కుంభ రాశి
ఈ రాశివారు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. తలపెట్టిన పనిలో వైఫల్యం కారణంగా నిరాశ చెందుతారు. రిస్క్ తీసుకోవడం వల్ల ఇంకా నష్టపోతారు. నీటి ప్రదేశాలకు వెళ్లవద్దు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మీన రాశి
ఈ రోజు మీ ప్రవర్తన వల్ల ఎవరైనా మానసికంగా బాధపడతారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుస్తారు. పార్టీల్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. తల్లిదండ్రుల సలహాలు పాటించండి.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Telangana News:
"ప్రతి మహిళా సంఘానికో బస్‌- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం 
ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Advertisement

వీడియోలు

KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
Varanasi Movie Chhinnamasta Devi Story | వారణాసి ట్రైలర్ లో చూపించిన చినమస్తాదేవి కథ తెలుసా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Telangana News:
"ప్రతి మహిళా సంఘానికో బస్‌- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం 
ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Actress Hema: నటి హేమకు మాతృవియోగం... రాజోలులో ఆకస్మిక మరణం
నటి హేమకు మాతృవియోగం... రాజోలులో ఆకస్మిక మరణం
TTD: యువతకు కుటుంబంతో సహా ఉచితంగా బ్రేక్ దర్శనం ఇచ్చే ఆఫర్  ప్రకటించిన టీటీడీ - ఇవిగో డీటైల్స్
యువతకు కుటుంబంతో సహా ఉచితంగా బ్రేక్ దర్శనం ఇచ్చే ఆఫర్ ప్రకటించిన టీటీడీ - ఇవిగో డీటైల్స్
Andhra Maoists: ఏపీని షెల్టర్‌గా మార్చుకుని బుక్కయిన మావోయిస్టులు - 31 మంది అరెస్ట్ - భారీగా డంపులు గుర్తింపు
ఏపీని షెల్టర్‌గా మార్చుకుని బుక్కయిన మావోయిస్టులు - 31 మంది అరెస్ట్ - భారీగా డంపులు గుర్తింపు
Varanasi Movie Budget: వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
Embed widget