ఆగష్టు 7 రాశిఫలాలు, ఈ రాశివారు సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 7th
మేషరాశి
ఈ రాశివారు తమ పనితీరుతో సంతృప్తి చెందుతారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో సక్సెస్ అవుతారు. కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు...ఎప్పటి నుంచో ఆగిపోయిన సొమ్ము కూడా చేతికందుతుంది.ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి ఉద్యోగులు కొన్ని కారణాల వల్ల కార్యాలయంలో మాటలు పడాల్సి రావొచ్చు. జరిగిన తప్పును బ్యారీజు వేసుకోవాలి. వ్యాపారులు తమ నిర్లక్ష్యాన్ని వీడకపోతే నష్టపోతారు. వైవాహిక జీవితంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. పరిస్థితులతో పోరాడేందుకు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి.
మిథున రాశి
ఈ రాశివారి వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులవుతారు.ఆన్ లైన్ వ్యాపారులకు ఈ రోజు మంచిరోజు. కళలు, సృజనాత్మక పనులు చేసేవారికి కలిసొస్తుంది. గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న ఇబ్బందులు సమసిపోతాయి. ఆస్తి లావాదేవీల నుంచి ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి
ఈ రాశివారి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కెరీర్ అవకాశాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారంలో లాభమున్నప్పటికీ మనస్సు సంతృప్తి చెందదు. చెడు అలవాట్లు ఉండేవారు, వ్యసనానికి బానిసైనవారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. తగినంత నిద్ర చాలా అవసరం.
Also Read: చాణక్య నీతి : బుద్ధిమంతులు ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారు!
సింహ రాశి
ఈ రాశివారు ఆర్థిక సంబంధ విషయాలలో ఈ రోజు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మేధావులను కలుస్తారు. ఆకస్మిక అవకాశాలు మీ సంతోషానికి కారణం అవుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు. తల్లిదండ్రులతో సంతోష సమయం గడుపుతారు.
కన్యారాశి
కన్యారాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల కోపానికి గురవుతారు, ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు నియంత్రించుకోవాలి. మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు సమస్యలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేయండి. మోకాళ్ల నొప్పితో బాధపడతారు.
తులారాశి
ఈ రాశివారు చేపట్టిన పనులును త్వరగా పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అవివాహితులకు సబంధం కుదురుతుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ ఆలోచనా విధానం, అభిప్రాయాలు ఉన్నతాధికారులకు నచ్చకపోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. పాతవిషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు తమ పనులన్నీ ఏకాగ్రతతో చేస్తారు. స్నేహితుల సహకారంతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
మకర రాశి
ఈ రాశివారు తాము చేయాల్సిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కొన్ని విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. సృజనాత్మక సామర్థ్యాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఎవ్వర్నీ తొందరగా నమ్మేయవద్దు.
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు భారీ లాభాలు పొందుతారు. క్లిష్టమైన విషయాలను సులభంగా పరిష్కరిస్తారు. పోటీదారులపై పైచేయి సాధిస్తారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ఎవరి నుంచి ఎక్కువగా ఆశించకండి. రెగ్యులర్ గా ఉండే హడావుడిలో మునిగిపోతారు. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ ఆలోచనలను విస్తృతపరిచేందుకు ప్రయత్నించండి. సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టేయడం మంచిది. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం ఉత్తమం.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.