చాణక్య నీతి : బుద్ధిమంతులు ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారు!
Chanakya Neeti In Telugu : బుద్ధిమంతులు, మంచి వ్యక్తులు అనే ప్రశంస ఊరికేరాదు... అందుకు మీలో కొన్ని లక్షణాలుండాలని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అవేంటో చూద్దాం...
Chanakya Neeti In Telugu : ఆచార్య చాణక్యుడు బోధించిన విషయాలు అప్పటికీ ఇప్పటికి ఎప్పటికీ అనుసరణీయమే. మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి తన శిష్యులకు ఎన్నో బోధనలు చేసిన ఆచార్య చాణక్యుడు ఇందులో భాగంగా కొన్ని రహస్యాలను బయటపెట్టకుండా ఉంచడం బుద్ధిమంతుల లక్షణం అన్నాడు. అసలు కొన్ని విషయాలు బయటపెట్టకుండా దాచుకోగలిగి నప్పుడే వారు బుద్ధిమంతులు అవుతారని చెప్పాడు. ఇంతకీ రహస్యంగా ఉంచాల్సిన విషయాలేంటో చూద్దాం...
సుసిద్ధ్యౌషధం ధర్మ గృహచ్ఛిద్రం వ మైధునమాకుభుక్తం
కుశృతం చైవ మతిమాత్ర ప్రకాశయేత్
ఏ ఏ విషయాల్లో గోప్యత పాటించాలో వివరిస్తూ ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు. సిద్ధ ఔషధాలు, చేసిన సాయం, ఇంట్లో లోటుపాట్లు, సంభోగం, చెడు భోజనం, తన విన్న చెడు మాటల గురించి బుద్ధిమంతులు ఎప్పుడూ ఎవ్వరితోనూ ప్రస్తావించరని ఈ శ్లోకం అర్థం
Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!
- కొన్ని మందులు కొందరికి సిద్ధిస్తాయి, కొందరికి మేలు జరుగుతుంది ఆ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే చెబితే ఆ మందు ప్రభావం తగ్గుతుందంటాడు చాణక్యుడు
- తను చేసిన ధర్మం గురించి ఎవరికీ చెప్పకూడదు.. ఆ ధర్మాన్ని ఆచరించుకుంటూ వెళ్లిపోవాలి
- ప్రతి కుటుంబంలో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి..వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి కానీ బయటపెట్టుకోరాదు. అలా చెప్పడం వల్ల మోసపోయేది, చులకన అయ్యేది మీరే అని గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ లోటుపాట్లు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని బయటకు చెప్పడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపిన సమయం, ఆ సమయంలో మాట్లాడుకున్న విషయాల గురించి కూడా ఎవ్వరితోనైనా చెప్పుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇది పూర్తిగా పడకగదికి సంబంధించిన వ్యవహారం. వీటిని కూడా వేరేవారితో చర్చించడం సరికాదు.
- నిషిద్ధ వస్తువులేవైనా పొరపాటున తినేస్తే ఆవిషయం మీరు గ్రహించి మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటే చాలు. ఆ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల అల్లరిపాలయ్యేది మీరే.
- ఎవరైనా మీకు తప్పుడు విషయాలు చెప్పినా, మీరు వినకూడదని మాటేలేమైనా విన్నా వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు. ఈ మాటలను మీ వరకే పరిమితం కావాలి కానీ పెదవి దాటి బయటకు రాకూడదు.
Also Read: చాణక్య నీతి - ఇలాంటి లక్షణాలు ఉన్న ముగ్గురితో స్నేహం ప్రమాదకరం - మీ దోస్తులు ఇలాగే ఉన్నారా?
ఇక మీ మాటల ద్వారా మీ గుణం వ్యక్తం అవుతుందనే విషయాన్ని శిష్యులకు బోధిస్తూ చాణక్యుడు ఇలా చెప్పాడు
తపన్మౌనేన నీయుక్తే కోకిలశ్చైవ వానరాః
యావతసర్వం జనానష్టదాయినీ వాఢం న ప్రవర్తతి
గొంతు నుంచి మధుర స్వరం వినిపించనంతకాలం కోకిక మౌనంగా ఉండి పోతుంది. వసంతకాలం వచ్చేవరకూ వేచి ఉండి అప్పుడు తన మధుర స్వరంతో అందరికీ ఆనందాన్ని పంచుతుంది కోకిల. అందుకే మాట్లాడేటప్పుడు కమ్మగా ఉండేలా మాట్లాడాలి. కోకిలా మధురంగా అనిపించాలే కానీ ఏంటీ కాకిగోల అనే ఆలోచన ఎదుటివారికి రాకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.