Image Credit: Pixabay
Horoscope Today 2023 August 14th
మేష రాశి
ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.
వృషభ రాశి
ఈ రాశివారికి కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి బాటవేస్తారు. ఉన్నతాధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులు సంతోషకరమైన ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
ఈ రాశివారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో స్థలం మారే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. వాహన నిర్వహణ, వస్త్రాల కోసం ఖర్చులు పెరుగుతాయి.
Also Read: ఈ వారం ఈ రాశివారు ఒకేసమయంలో గుడ్ న్యూస్-బ్యాడ్ న్యూస్ రెండూ వింటారు!
కర్కాటక రాశి
ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల సహకారం పొందుతారు. ధార్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా సంపూర్ణంగా ఉంటుంది. విద్యా కార్యాల్లో విజయం ఉంటుంది. రాజకీయ నాయకులను కలుస్తారు. స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలు పొందుతారు. స్నేహితులతో కలసి పర్యటనలకు ప్లాన్ చేసుకుంటారు.
కన్యా రాశి
ఈ రాశివారు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.
తులా రాశి
ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. ఉన్నత విద్య లేదా విద్యా సంబధిత పనికోసం వేరే ప్రదేశానికి వెళ్లవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. విద్యార్థులేకు చదువుపట్ల శ్రద్ధ పెరుగుతుంది. ప్రారంభించిన పనిలో ఆంటకాలు ఎదురైనా అధిగమిస్తారు.
Also Read: కన్యారాశిలో కుజుడి సంచారం, ఈ రాశులవారికి గుడ్ టైమ్!
ధనుస్సు రాశి
ఈ రాశివారు పాత స్నేహితులను కలుస్తారు. నూతన ఆదాయ వనరుల గురించి చర్చిస్తారు. స్నేహితుల సహాయంతో వ్యాపారం విస్తరిస్తుంది. తోబుట్టువుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకోవడంలో బిజీగా ఉంటారు.
మకర రాశి
జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రారంభించే పనులకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. కళలు లేదా సంగీతం వైపు ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి సహకారం ఉంటుంది. పనిప్రదేశంలో మార్పులు జరుగుతాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి.
కుంభ రాశి
కొత్తగా ప్రారంభించబోయే పనులకు ఈ రాశివారికి జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయం ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశివారు కుటుంబ సభ్యుల సమస్యలపట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచిసమయం. ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రణాళికలు వేసుకునే విద్యార్థులకు కొన్ని అంతరాయాలుంటాయి.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Horoscope Today October 02, 2023: ఈ రాశివారు మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, అక్టోబరు 2 రాశిఫలాలు
Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!
Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!
Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!
Vidur Niti In Telugu : ఈ 4 లక్షణాలున్నవారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>