అన్వేషించండి

Mangal Gochar 2023: కన్యారాశిలో కుజుడి సంచారం, ఈ రాశులవారికి గుడ్ టైమ్!

Mars Will Enter Virgo: ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న కుజుడు ఆగష్టు 18 నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తోంది.

Mangal Gochar 2023:  జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తిలో ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆగష్టు 18 న సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి  ప్రవేశించబోతున్నాడు కుజుడు. ఈ సంచారం కొన్ని రాశులకు శుభప్రదమైన ఫలితానిస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం..

మేష రాశి

కన్యా రాశిలో కుజుడి సంచారం అంటే మేష రాశినుంచి ఆరో స్థానంలో సంచరిస్తోంది. ఇది మీకు కలిసొచ్చే సమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం బావుంటుంది. కార్యాలయంలో కొన్ని మార్పులు ఉంటాయి. అయితే కుజుడి ప్రభావంతో మీలో దూకుడు , కోపం పెరుగుతుంది.

మిథున రాశి 

కుజుడి సంచారం మీ రాశినుంచి నాలుగో స్థానంలో ఉంటుంది. ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న డబ్బు చేతికందుతుంది.  అయితే కుజుడి ప్రభావం కచ్చితంగా మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీ భావాలకు మార్గం దొరకనందున కొంత నిరాశకు గురవుతారు.

Also Read : స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!

కర్కాటక రాశి

కర్కాటక రాశి నుంచి కన్యా రాశి అంటే మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అంగారకుడు. మీలో ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఇది శుభ సమయం. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. 

వృశ్చిక రాశి 

కన్యా రాశిలో కుజుడి సంచారం మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటూ ఆనందాన్ని అందిస్తుంది. నూతన సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. మీ కోర్కెలు నెరవేరుతాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు దాన్నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.  ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. 

ధనస్సు రాశి

కుజుడు ధనుస్సు రాశి వారికి వృత్తి జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. కెరీర్‌లో పెద్ద మార్పు రావచ్చు. ఆత్మవిశ్వాసం మరియు శక్తితో నిండి ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనులు ప్రశంసించబడతాయి.

Also Read: ఆగష్టు 12 రాశిఫలాలు, ఈ రాశులవారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు!

మకర రాశి

అంగారక సంచారం మకర రాశి వారికి ఆరోగ్య ప్రయోజనాలను అందించబోతోంది. కుటుంబంలో కొన్ని ఆధ్యాత్మిక  కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మాటలపై సంయమనం పాటిస్తే మంచిది. మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తన కలిగి ఉండండి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఇది మంచి సమయం. ప్రారంభించిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్MS Dhoni Heroics vs LSG | IPL 2025 లో లక్నోపై విరుచుకుపడిన మహేంద్ర సింగ్ ధోనీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Ravi Teja - Chakri: చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
Sunstroke: వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
Telangana News: 2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
Embed widget