అన్వేషించండి

ఆగష్టు 12 రాశిఫలాలు, ఈ రాశులవారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 August 12th

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు గుడ్ టైమ్. కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదిగేందుకు మంచి అవకాశం వస్తుంది. ముఖ్యమైన ప్రాజెక్ట్ కు సంబంధించి అడుగు ముందుకుపడుతుంది. కుటుంబ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాయామంపై దృష్టి సారించండి. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం.

వృషభ రాశి
ఈ రాశివారు ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. కొన్ని విషయాల్లో రిస్క్ చేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిసమయం. విద్యార్థులు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అంతా బాగానే ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులకు మంచి సమయం. 

మిథున రాశి
ఈ రాశివారికి ఆర్థికంగా ఈ రోజు మంచిరోజు.  చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సులభంగా దాటగలుగుతారు. కొన్ని  సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారు. అప్పులు చెల్లిస్తారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైనవారితో లోతైన ప్రేమను పొందుతారు.  కుటుంబం నుంచి మంచి మద్దతు పొందుతారు. దూరపు బంధువులు అనుకోని విధంగా పరిచయాన్ని పునరుద్ధరించుకోవచ్చు 

Also Read: ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!

కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ కెరీర్‌లో మంచి మలుపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంటారు. మీ నైపుణ్యాలు, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలు రావొచ్చు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. మీ కృషి , అంకితభావం చివరకు ఫలిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన పోషకాహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి.

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు అవుతుంది. జీవితంలో ఏ సమస్య వచ్చినా పోరాడే ధైర్యం లభిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న కొన్ని సమస్యలకు ఈరోజు సమాధానం పొందుతారు. మీ సానుకూల ఆలోచన, నిజాయితీ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. 

తులా రాశి 
డబ్బును సంపాదించడం కాదు తెలివిగా ఖర్చు చేయడం నేర్చుకోవాలన్న విషయం ఈ రోజు మీకు అర్థమవుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటే ఆ ప్రయాణం మీకు సంతోషాన్నిస్తుంది. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది.

Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!

వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారికి కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది, అధికారుల సహవాసం ఉంటుంది. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టొచ్చు.  ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. సృజనాత్మక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది

ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులకు పూర్తి ఏకాగ్రత అవసరం. కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కుతుంది. ఉన్నతాధికారుల అంచనాలను అందుకోవాలని ఆలోచిస్తారు. ప్రియమైన వారి ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీకు చాలా అవసరమైనప్పుడు సహాయం చేసినవారిపై కృతజ్ఞతతో ఉండండి.

మకర రాశి
ఈ రాశివారిలో విశ్వాసం నిండి ఉంటుంది. వ్యాపారంలో వచ్చే ఇబ్బందులను అధిగమించాలి. కుటుంబ సభ్యుల విషయంలో కోపం తగ్గించుకోవాలి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శ్రమ పెరుగుతుంది. స్నేహితులతో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. నూతన ఆస్తుల కొనుగోలు చేసేందుకు అడుగు ముందుకేస్తారు. వ్యాపార ప్రతిపాదనలు అందుతాయి. పనిలో బిజీ పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. 

కుంభ రాశి
మీ సృజనాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాల కారణంగా మీరు విజయం దిశగా అడుగేసేందుకు కొత్తప్రయత్నాలు చేస్తారు.  ఆర్థికంగా దృఢంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.  సహోద్యోగుల నుంచి సీనియర్ల నుంచి సహకారం ఉంటుంది. కొత్తగా పెళ్లైన దంపతులు సంతాన సంతోషం పొందే అవకాశం ఉంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. 

మీన రాశి
ఈ రాశివారిలో విశ్వాసం నిండి ఉంటుంది. కుటుంబంలో ఆనందం  ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ఎదురైన ఇబ్బందులు తగ్గుతాయి. మేధోపరమైన పనులలో చాలా బిజీగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget