News
News
X

మార్చి 1 రాశిఫలాలు, ఈ రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం అందదు

Rasi Phalalu Today 1st March 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి 

ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. సన్నిహితులతో ఉన్న మనస్పర్థలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. కార్యాలయంలో సహోద్యోగులో స్నేహం కుదురుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమఫలితాలున్నాయి. కళలు, సాహిత్యంతో సంబంధం ఉన్నవారికి ప్రయోజనకరమైన రోజు.

వృషభ రాశి 

ఈ రోజు వ్యాపారంలో తొందరపడి తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు హాని కలిగిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులుంటాయి గౌరవం పెరుగుతుంది. స్వీయ-మెరుగుదల,  అభివృద్ధి కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కొంత విచారంగా ఉంటారు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన సమయం. మీరు సాధించిన విజయాలకు తగిన సంతృప్తిని పొందుతారు. ఆర్థిక విషయాల్లో వృద్ధి, మెరుగుదలకు బలమైన సంకేతాలు ఉన్నాయి.

Also Read: 2023 మార్చినెల రాశిఫలాలు, అపనిందలు, ఆకస్మిక ప్రమాదాలు - మార్చిలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు ఆశించిన విధంగా కుటుంబం నుంచి సహాయం పొందలేరు, దీని వల్ల మీ కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కానీ ఆఫీసులో పరిస్థితి బాగుంటుంది. సాయంత్రం, మీరు అకస్మాత్తుగా స్నేహితుడి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. స్నేహితుల సలహాలు పాటించండి మీకు మంచి జరుగుతుంది

సింహ రాశి

ఈ రోజు మీరు  ఆర్థిక లావాదేవీల విషయంలో ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాలవైపు ఆకర్షితమవుతుంది. పని ఒత్తిడి వల్ల తొందరగా అలసిపోతారు కానీ శత్రువులపై పైచేయి సాధిస్తారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి

కన్యా రాశి

ఈ రోజు కన్యారాశివారికి అధృష్టం బాగానే ఉంటుంది. అనుకున్నపనులు పూర్తవుతాయి. పనులు వాయిదా వేయొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. రాత్రిపూట డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి..జాగ్రత్తపడండి.

తులా రాశి 

ఈ రోజు ఈ రాశివారికి తల్లిదండ్రుల సలహాలు బాగా ఉపయోగపడతాయి. పిల్లల నుంచి కొన్ని ప్రత్యేకమైన వార్తలు అందుకుంటారు. తీవ్రమైన విషయాలపై మరింత తీవ్రంగా స్పందించకండి. శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దూరపు బంధువు నుంచి అకస్మాత్తుగా వచ్చే సందేశం కుటుంబం మొత్తానికి ఉత్సాహాన్నిస్తుంది. బద్దకించొద్దు..అనుకున్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమఫలితాలున్నాయి. 

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారికి వ్యవహార జయం, ఆర్థిక లాభం

ధనుస్సు రాశి 

ఈ రోజు క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారం ప్లాన్ చేసుకుంటే మంచి జరుగుతుంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. అనుకోని పర్యటన చేయాల్సి ఉంటుంది. 

మకర రాశి 

 ఈ రోజు ఏకపక్ష ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. కొన్ని పనులలో చాలా బిజీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలి. ఇతరుల నుంచి వచ్చే సలహాలు ప్రయోజకరంగా ఉంటాయి. ఉద్యోగులు పనిని పక్కనపెట్టొద్దు. సమయం వృధాచేయకుండా ప్లాన్ చేసుకోండి

కుంభ రాశి

ఈ రోజు ఉదయం మీరు కోపంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని తప్పుతోవ పట్టించేవారి గురించి మీరు తెలుసుకుంటారు..అయితే వారిపై ప్రత్యక్షంగా కాకుండా నిఘా పెట్టడం ద్వారా వాస్తవాన్ని గ్రహించడం మంచింది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమఫలితాలున్నాయి. 

మీన రాశి

ఈ రోజు మీనరాశివారు శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఈ రోజు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది.. భవిష్యత్ లో మీకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ దృష్టి మొత్తం మీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడంపైనే ఉంటుంది.

Published at : 01 Mar 2023 05:22 AM (IST) Tags: rasi phalalu Horoscope Today astrological prediction today Today Rasiphalalu in telugu Horoscope for March 1st march 1st Horoscope

సంబంధిత కథనాలు

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు

మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్