News
News
X

ఫిబ్రవరి 19 రాశిఫలాలు, ఈ రాశివారు 'నో' చెప్పేందుకు సిద్ధంగా ఉండండి

Rasi Phalalu Today 19th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి 

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇదే ఆనందం మీ ఉద్యోగంలో కూడా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. జీతం పెరుగుదలకు సంబంధించి సమాచారం తెలుస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది

వృషభ రాశి

పనిచేసే ప్రదేశంలో వివాదాలు ముగియడంతో ప్రశాంతంగా ఉంటారు. మీరు పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి. మాట మీద నియంత్రణ చాలా ముఖ్యం. పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయి. కొత్త వ్యక్తుల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. గృహంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథున రాశి

ఆలయాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుభవజ్ఞుల నుంచి జ్ఞానాన్ని పొందుతారు. పెట్టుబడులు పెట్టేముందు ఓసారి ఆలోచించడం మంచిది...తెలివిగా ఆలోచించి పెట్టిన పెట్టుబడులే లాభాన్నిస్తాయి. కష్టపడి సంపాదించిన డబ్బుని ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. 

కర్కాటక రాశి 

ఈ రోజు ఒడిదొడుకులతో కూడిన రోజు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ఇంటి పెద్దల సలహా తీసుకోండి. స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి. ప్రభుత్వ పనులకు ఆటంకం కలగవచ్చు, కాస్త ఒత్తిడికి లోనవుతారు.

Also Read: కుంభ రాశిలో సూర్య సంచారం, 7 రాశులవారికి అద్భుతం, 5 రాశులవారికి ప్రతికూలం

సింహ రాశి

సింహ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం వల్ల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమను పొందుతారు. మీలో ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

కన్యా రాశి

ఈ రోజు మిమ్మల్ని శాసిస్తున్న భావోద్వేగ మానసిక స్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. అప్పుల కోసం మీ దగ్గర చేయిచాచేవారికి నో చెప్పేందుకు ప్రిపేర్ అవండి. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు నియంత్రించండి. 

తులా రాశి 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో పై అధికారుల సహాయసహకారాలు లభిస్తాయి. మీకు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. వివాదాల్లో చిక్కుకోకండి, లేకపోతే సమస్య పరిష్కారానికి బదులు సంక్లిష్టంగా మారవచ్చు. ఇచ్చిన డబ్బును  తిరిగి పొందుతారు.

వృశ్చిక రాశి 

ఈ రోజు ఆకస్మిక ప్రయాణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు ఈ రోజు తలపెట్టే అతిపెద్ద పనిపై దృష్టి సారించండి. వ్యాపారులు పరిధి పెంచుకునేందుకు చూస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీలో అదనపు శక్తి ఉంటుంది. పనిభారం మీలో నిరాశను కలిగిస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా విమర్శలు, వాదోపవాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీనుంచి ఎక్కువగా ఆశించేవారికి నో చెప్పడానికి సిద్ధంగా ఉండండి. 

Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

మకర రాశి 

ఈ రోజు పనిలో చాలా రోజులుగా కొనసాగుతున్న ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజు మీరు క్రమబద్ధమైన శైలి, ఏకాగ్రతతో పని చేస్తారు. మీ పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. వ్యాపారులకు మంచిరోజు

కుంభ రాశి 

ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బావుంటుంది. ఈ రోజు మీకు బహుమతులు, సన్మానాలు లభిస్తాయి. మీ అంచనాలకు అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడం మిమ్మల్ని చాలా సంతృప్తి పరుస్తుంది. వైవాహిక జీవితంపై భయాలు ఉండవచ్చు.

మీన రాశి 

ఈ రోజు మీరు జీవితాన్ని సంపూర్ణంగా గడుపుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు సంతోషంగా మరికొందరు విషాదంగా ఉంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

Published at : 19 Feb 2023 05:41 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Maha Shivratri 2023 Today Rasiphalalu astrological prediction today Horoscope for Feb 19th Feb 19th Horoscope 19th feb Horoscope

సంబంధిత కథనాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి