అన్వేషించండి

మే 19 రాశిఫలాలు, ఈ రాశివారు ఈరోజు పెద్ద గందరగోళం నుంచి బయటపడతారు

Rasi Phalalu Today 19th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మే 19 రాశిఫలాలు

మేష రాశి

అత్యాశకు పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోకండి . కోర్టు వివాదాలకు దూరంగా ఉండండి.  అనవసరమైన పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది. మానసిక చికాకులు వలన మీ ఏకాగ్రత లోపిస్తుంది.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం . ఎవరితోను గొడవలు పడకండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త.

వృషభ రాశి

ఈరోజు మీరు వ్యాపారంలో లాభాలు పొందుతారు. పిల్లలతో సంబంధాలు బాగానే ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత  మానసిక , శారీరక  ఇబ్బందులు ఉంటాయి.  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ విషయంలోనూ  ఎమోషనల్‌గా ఉండొద్దు. ఈ రోజు పెద్ద గందరగోళం తొలగిపోతుంది. . కోర్టు వ్యవహారాల్లో  జాగ్రత్తగా ఉంటే మంచిది. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం పొందుతారు . కొంతమంది మీకు సహాయం చేస్తారు.

మిథున రాశి

ఈరోజు మీకు అనుకూలమైన రోజు . ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది . వ్యాపారస్తులకు  ఆదాయం  పెరుగుతుంది.  కుటుంబ పెద్దల  ఆశీస్సుల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్నేహితుల వలన  లాభాలు ఉండవచ్చు. ఏదో ఒక సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటారు . అధిక ధనలాభం పొందే అవకాశం ఉంది.

Also Read: లోకంలో భార్య-భర్తలు 5 రకాలు- మీ జంట ఇందులో ఏ రకమో చూసుకోండి!

కర్కాటక రాశి

ఎవరితోనూ  వాదనలు పెట్టుకోవద్దు . గొడవలకు దూరంగా ఉండాలి.. మాటల్లో,  ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత నిర్ణయాలు తీసుకొన్నట్లయితే  మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అధికారులు మీ పని పట్ల సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  

సింహరాశి 

ఈ రోజు కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగవద్దు. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండండి.

కన్య రాశి

మీరు ఈ రోజు చాలా బిజీగా గడుపుతారు .విందు వినోదాల్లో పాల్గొంటారు.   స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది . మానసిక ఆందోళన ఉండొచ్చు.  ఎమోషనల్స్ ని, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.   ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అప్రమత్తం గా ఉండండి.

తులా రాశి

వ్యాపార విస్తరణకు అనువైన రోజు . ఆదాయమార్గాలు సుగమమం అవుతాయి. ధనాభివృద్ది . వ్యాపారంలో నూతన పెట్టుబడులు  కలిసివస్తాయి. విదేశీ  వ్యవహారాల్లో విజయం ఉంటుంది.  కుటుంబ సభ్యులతో అకారణ కలహాలుంటాయి. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్యులతో  విభేదలు జరిగే అవకాశం ఉంది వ్యాపారులు జాగ్రత్త. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు . 

Also Read: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!

వృశ్చిక రాశి

ఈ రోజు సాహిత్య కార్యకలాపాలకు అనుకూలమైన రోజు.  రచయితలకు శుభ ప్రదం. నూతన రచనలకు శ్రీకారం చుట్టండి.  ఈరోజు ఏదైనా సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో  పాల్గొనే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు చేసే మంచి పనుల వల్ల మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.  ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తల్లికి అనారోగ్య సూచనలు కారణంగా  మీఆలోచనలు  ప్రతికూలంగా మారతాయి. రోజు  ప్రారంభంలో సంపద , కీర్తికి భంగం. చెడు సావాసాలు,  కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతారు.  అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. విద్యార్థులకు ఈరోజు శుభదినం.

మకర రాశి

జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.  సోదరులతో సత్సంబంధాలుంటాయి.   సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై మీదే పైచేయి . మధ్యాహ్నం తర్వాత కొంత అనారోగ్య సూచన అప్రమత్తంగా ఉండండి.  తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి .  వ్యాపారంలో  భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు  విషయాల్లో సంయమనం పాటించండి. 

కుంభ రాశి

ఈ రాశి వారికి అధిక ధనవ్యయం . మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏ  విషయాన్ని అయినా ప్రేమతో పరిష్కరించుకోండి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత  ఉంటుంది. మీ దృష్టి కొన్ని సృజనాత్మక కార్యకలాపాల వైపు ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. 

మీన రాశి

ఈ రోజు మీకు అత్యంత శుభదినం. మీరు ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్య క్రమాలకు అనుకూలమైన రోజు.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. విందు వినోద ల్లో గడుపుతారు.   మధ్యాహ్నం తర్వాత సంయమనం పాటించండి, లేకుంటే ఎవరితోనైనా వాగ్వాదానికి దిగే అవకాశం ఉంటుంది. డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget