అన్వేషించండి

మార్చి 18 రాశిఫలాలు, ఈ రాశివారి కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు అపనమ్మకం పెంచుకుంటారు

Rasi Phalalu Today 18th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మేష రాశి 

ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఆందోళన తప్పదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టలేరు. ఎన్నో కొత్త ఆలోచనలు మీ మనసులో పరిగెడుతూనే ఉంటాయి. ఆదాయ మార్గాల బలోపేతానికి కృషి చేస్తారు. పిల్లలకు సంబంధించిన అవసరాలు తీర్చడంలో సక్సెస్ అవుతారు.

వృషభ రాశి 

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉండే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితం గడిపేవారికి ఈ రోజు అంత మంచిది కాదు..వారు కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభదినం

మిథున రాశి

ఈ రోజు కుటుంబ స్థాయిలో ఆనందం పెరుగుతుంది.. కానీ చిన్న విషయాలకు కోపం వచ్చే అలవాటు మీ ఆనందాన్ని పాడు చేస్తుంది. ఈ రోజు కోపానికి దూరంగా ఉండడమే మంచిది. కొత్త వ్యక్తులను కలుస్తారు. రోజంతా సరదాగా గడుపుతారు

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆదాయం బాగుంటుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది, ఇది మీ కొత్త బాధ్యతలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

సింహ రాశి

సింహ రాశివారికి ఈ రోజు మంచిరోజు. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మీరు పని పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. కొందరికి బదిలీ జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది

కన్యా రాశి

ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు.  అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు

తులా రాశి 

ఈ రోజు ఎవరి సహాయానికి దూరంగా ఉండండం మంచిది. పరిశోధనలలో పాల్గొనేవారు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వీయ నియంత్రణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి

వృశ్చిక రాశి 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.  మాటలో ఆచరణాత్మకత, మొండితనం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది కానీ కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో ఒకరిపై ఒకరు అపనమ్మకం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

ధనుస్సు రాశి 

ఈ రోజు ధనస్సు రాశివారి ఆలోచన దైవారాధనపై ఉంటుంది. కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై దృష్టిసారిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. 

మకర రాశి 

ఈ రోజు మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సహనంగా వ్యవహరించండ మంచిది. ప్రేమికులకు, వివాహితులకు ఈ రోజు అంత మంచి ఫలితాలు లేవు. ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

కుంభ రాశి 

ఈ రోజు మీరు కొన్ని మంచి ఫలితాలను పొందుతారు..కొన్ని సందర్భాల్లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మీన రాశి

ఈ రోజు మీరు కష్టపడి పనిచేయడం వల్ల ధనాన్ని పొందుతారు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి పట్ల మీ అభిప్రాయాన్ని మీకే పరిమితం చేయండి. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల సంతోషంగా ఉంటారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Embed widget