Horoscope Today 16th june 2024 : ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు, భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు
Horoscope Prediction 16th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![Horoscope Today 16th june 2024 : ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు, భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు Horoscope Today 16th june 2024 Astrological prediction for june 16 2024 rasi phalalu in telugu Horoscope Today 16th june 2024 : ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు, భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/15/df98b390cf5975bf94a875da085490ac1718471378712217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఎవరి అంచనాలకు అందరు. ఉద్యోగులుకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దగా హెచ్చుతగ్గులుండవు. పెండింగ్ పనుల గురించి ఆలోచిస్తారు.
వృషభ రాశి
లాంగ్ ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. శత్రువులు మీ ముందు బలహీనులవుతారు. సాధారణ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకండి.
మిథున రాశి
ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయించాలి అనుకుంటారు. కొన్ని కారణాలవల్ల చికాకుగా ఉంటారు. అన్నదమ్ముల విషయంలో ఆందోళనలు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరుగుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు..వీరి ప్రతి అడుగు నాన్నకు ప్రేమతో!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ పనిలో చాలా చురుకుగా ఉంటారు. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. తండ్రి సలహా మీకు చాలా ఉపయోగపడుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఖర్చులు పెరుగుతాయి.
సింహ రాశి
ఈ రోజు మీ మాటతీరు బంధాలపై ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయద్దు.
కన్యా రాశి
వ్యాపారంలో చాలా శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది కానీ మీ తప్పులను గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలొస్తాయి. పరిశోధనా రంగంలో ఉండేవారు ఆశించిన విజయం పొందుతారు.
Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!
తులా రాశి
ఈ రోజు మీరు నిరుత్సాహానికి లోనవుతారు కానీ శ్రేయోభిలాషుల నుంచి మంచి సలహాలు స్వీకరిస్తారు. ఈ రోజు పెట్టే పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం వీడాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటలతో అందర్నీ ప్రభావితం చేయగలరు. విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు పాత అప్పులను తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తారు. వివాదాలు పరిష్కారం కావడంతో మీ మనోధైర్యం పెరుగుతుంది. కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలు అందుకుంటారు.
మకర రాశి
ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత అధికారులనుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి భావాలను పరిగణలోకి తీసుకోండి.
కుంభ రాశి
ఈ రోజంతా మీరు చిరాకుగా ఉంటారు. ముఖ్యమైన పనులు ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అనవసర చర్చలు, వాదనలకు దూరంగా ఉండండ మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి
మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. భవిష్యత్ పని కోసం ప్రణాళికలు వేసుకుంటారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కారం అవుతాయి. ప్రతికూల వ్యక్తులగురించి ఇంట్లో చర్చించకపోవడమే మంచిది. తగినంత నిద్ర అవసరం...
Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)