ఫిబ్రవరి 15 రాశిఫలాలు , ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి
Rasi Phalalu Today 15th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం . మీ ఆత్మవిశ్వాసం పెరగడానికి మీ సంతోషమే కీలకం అవుతుంది. మీ పనితీరుకి మీ పై అధికారి ముగ్ధులవుతారు. సాహిత్యంతో సంబంధం ఉన్నవారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది
వృషభ రాశి
ఈ రోజు ప్రయాణం మీకు అలసటను, ఒత్తిడిని కలిగిస్తుంది కానీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో నెగిటివిటీని తీసుకువచ్చే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ బంధువుల్లో ఒకరు మీ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారిలో కొందరికి ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కోపాన్ని నియంత్రించుకోకుంటే అనవసర వివాదంలో చిక్కుకుంటారు. అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి
Also Read: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది
కర్కాటక రాశి
ఈ రోజు ఏ విషయంలో అయినా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు..ఒత్తిడి తగ్గుతుంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితి కారణంగా ఏదైనా ముఖ్యమైన పని ఆగిపోయే అవకాశం ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యక్తులతో కనెక్ట్ కాకపోవడమే మంచిది. పాత మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. మతం పట్ల విశ్వాసం పెరుగుతుంది. మేధోపరమైన పనులు లాభిస్తాయి. అనవసర ఆందోళనలకు దూరంగా ఉండాలి. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి
పేదరికానికి మరో పేరు సోమరితనం..ఈ రాశివారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వైఖరి మిమ్మల్ని అపజయం వైపు నడిపిస్తుంది ఆ విషయం ముందుగా గుర్తించుకోవాలి. ఈ రాశిఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచి రోజు అవుతుంది. ఇప్పటికే వేసుకున్న ప్రణాళికను వేరొకరిపై రుద్దకుండా మీరే పూర్తిచేసుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా బలపడటం వల్ల ఇంట్లో పరిస్థితులు నార్మల్ అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. సమస్యను ఆరంభంలోనే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి..లేదంటే మరింత సమస్యగా మారే అవకాశం ఉంది.
Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
వృశ్చిక రాశి
ఈ రోజు చిన్న చిన్న సమస్యల కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. కొన్ని పనుల మాత్రం ఒత్తిడి వల్లే పూర్తవుతాయి...మీ పురోగతికి ఇదే ముఖ్యం. వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. భూమి, ఆస్తి విషయంలో తోబుట్టువులతో వివాదం ఏర్పడుతుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు చేసిన మంచి పనికి క్రెడిట్ లభించదు, కాబట్టి మీ పనిని మీరు ఎంజాయ్ చేయండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
మకర రాశి
ఈ రోజు పనిలో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది . క్రమశిక్షణ, ఏకాగ్రతతో పనిచేస్తే చాలా సమస్యలు సమసిపోతాయి. పెళ్లిళ్ల వ్యవహారాలకు సంబంధించిన వారు మంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు వ్యాపారులు లాభాలు పొందుతారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి..మీ ప్రతి సమస్యను ఇదే పరిష్కరిస్తుంది. ఈ రోజు మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి.
మీన రాశి
ఈరోజు వ్యాపార పరంగా మంచి రోజు . వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఈరోజు బంధువులతో ఫోన్ లో అనవసర విషయాలు మాట్లాడకపోవడం మంచిది. కోపం తగ్గించుకోవడం మంచిది. ఈ రాశివారు లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగిఉంటారు.