News
News
X

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

మహా శివరాత్రి ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18 శనివారం వచ్చింది. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేస్తారు భక్తులు. ఇంతకీ సర్వం శివమయం అని ఎందుకంటారో తెలుసా...

FOLLOW US: 
Share:

Maha Shivaratri 2023: కొత్తగా ఏదైనా కనిపెట్టిన వారిని ఆవిష్కర్తలు అని చెప్పుకుంటాం...ఇలా అయితే సృష్టిలో మొదటి ఆవిష్కర్త పరమేశ్వరుడే అని చెప్పాలి. సప్తస్వరాలు, నృత్యవిద్యలు, భావ వ్యక్తీకరణ ఇవన్నీ శివుడి ఆవిష్కరణలే అని తెలుసా

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజితా మా గృధ: కస్య స్విద్ ధనం

ఈ విశ్వంలో ప్రతి ఒక్కటీ మానవాతీత శక్తి లేదా  భగవంతుని నియంత్రణలో ఉంటుంది. అందులో మనకి అవసరమైనవే మనం గ్రహించి తక్కినవాటిని వదిలివేయాలని పై శ్లోకానికి అర్థం. 

Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అంటే  సమస్త ప్రపంచం ఈశ్వరమయం అనే కదా. అంటే పుట్టుక నుంచి మరణానంతరం చేరుకునే శ్మశానం వరకూ మన ప్రతి చర్యలోనూ, నేర్చుకునే ప్రతి విద్యలోనూ శివుడున్నాడు.

  • సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14  సూత్రాలు ఢమరుక నాదం నుంచి సృష్టించాడు శివుడు
  • వర్ణ సమ న్యాయం అందించిన శివుడికి కృతజ్ఞతగా అక్షరాభ్యాసం రోజు  ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’అని మొదటగా రాయిస్తారు
  • యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు
  • సంగీత విద్యకు మూలం సప్తస్వరాలు. అందులోని షడ్జమం(నెమలి) ,రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం) ,పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు), ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు
  • ‘శివ తాండవం’ ద్వారా ‘నృత్యవిద్య’ను అందించాడు
  • దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు
  • పార్వతికి సగభాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో చెప్పాడు
  • సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు
  • ‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశతు’ స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించమని  ప్రబోధించాడు
  • శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు
  • గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు
  • లింగంపై ఎన్ని అభిషేకాలు చేసినా ఏవీ నిలబడకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు
  • నిర్గుణతత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురుస్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.
  • అందుకే శివుడిని మించి ఆవిష్కర్తలు ఎవరని చెప్పగలం 

Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

ఈశాన సర్వ విద్యానాం
ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి 
బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం
ఓం నమః శివాయ

మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని చెబుతారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి...రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. మహా శివరాత్రి ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18 శనివారం వచ్చింది. 

Published at : 02 Feb 2023 10:46 AM (IST) Tags: lord shiva parvathi Maha Shivaratri 2023 Maha Shivratri and Date significance of Maha Shivratri shiva ratri jagarana Shivaratri 2023 feb 18 Lord Shiva the First Scientist

సంబంధిత కథనాలు

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

భద్రాచల రాములోరి పెండ్లికి ఈసారి చేస్తున్న ఏర్పాట్లివే! మంత్రికి వివరించిన అధికారులు

భద్రాచల రాములోరి పెండ్లికి ఈసారి చేస్తున్న ఏర్పాట్లివే! మంత్రికి వివరించిన అధికారులు

ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు

ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు

Chanakya Neethi: ఇలాంటి ఇంట్లో లక్ష్మి నిలవదు, ఆర్థికంగా నష్టపోతారు - చాణక్యుడు చెప్పిన కఠోర వాస్తవాలు

Chanakya Neethi: ఇలాంటి ఇంట్లో లక్ష్మి నిలవదు, ఆర్థికంగా నష్టపోతారు - చాణక్యుడు చెప్పిన కఠోర వాస్తవాలు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్