Horoscope Today 14th October 2022: ఈ రాశివారు ఏదైనా పని వాయిదా వేస్తే సమస్యలో చిక్కుకున్నట్టే, అక్టోబరు 14 రాశిఫలాలు
Horoscope Today 14th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 14th October 2022: ఈ రాశివారు ఏదైనా పని వాయిదా వేస్తే సమస్యలో చిక్కుకున్నట్టే, అక్టోబరు 14 రాశిఫలాలు Horoscope Today 14th October 2022, Horoscope 14th October Rasi Phalalu, astrological prediction for Aries, Gemini,Leo, Libra and Other Zodiac Signs Horoscope Today 14th October 2022: ఈ రాశివారు ఏదైనా పని వాయిదా వేస్తే సమస్యలో చిక్కుకున్నట్టే, అక్టోబరు 14 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/13/124c14fa9412454969abc1ae6b3ad2871665677271319217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 14th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసేవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. వీరికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. బంధువులతో సమస్య ఉండొచ్చు. ఓ లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. మాటతీరు మార్చుకుంటే మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు వితండవాదం చేయకపోవడం మంచిది.
వృషభం
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ దైనిందిత కార్యక్రమాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. ఉద్యోగులు పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారులు లాభం పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మాటతీరుకి అందరూ ఆకర్షితులవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. రాజకీయాల్లో పనిచేసేవారు ప్రజాభిమానం పొందుతారు.
మిథునం
ఈ రోజు ఏ పని చేసినా పూర్తి అవగాహనతో చేస్తారు. మీ కుటుంబంలో ఓ అతిథి రావడం వల్ల ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు. కుటుంబ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పెళ్లికుదరడం వల్ల సంతోషం పెరుగుతుంది. మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రాంతానికి వెళ్లేవారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి.. ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
కర్కాటకం
వ్యాపారులు ఈ రోజు లాభపడతారు. లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి. గతంలో చేసిన చిన్న చిన్న తప్పుల గురించి ఈ రోజు ఆందోళన చెందుతారు. ఉద్యోగులు పై అధికారుల ముందు తలొంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల కారణంగా కొంత నిరుత్సాహపడతారు. మీ ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఆలోచించి అడుగేయండి. స్నేహితుల కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!
సింహం
నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల్లో మీరు మౌనం వహించడం మంచిది..లేదంటే వివాదం మరింత ముదురుతుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిని పొందుతారు. కుటంబ సభ్యుల్లో ఒకరి కారణంగా మీరు బాధపడతారు.
కన్య
ఈ రోజు మీలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ముందుకు సాగుతాయి. పనిచేసే ప్రదేశంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. దూర ప్రాంతం ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. తోబుట్టువులతో కలసి ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యని కూర్చుని మాట్లాడడం ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. మీలో ఆత్మవిశ్వాసం మీ సంతోషాన్ని పెంచుతుంది.
తులా
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. గడిచిన సంఘటనల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవరేంటి అన్నది గ్రహించలేకపోతే మీరు తప్పుడు వ్యక్తులకు మద్దతు ఇస్తారు. వ్యాపారంలో ఓ వ్యక్తితో రాజీపడాల్సి ఉంటుంది. ఒక అపరిచితుడి కారణంగా మీకు హాని జరగొచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
వృశ్చికం
ఈ రోజు మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. పనిప్రాంతంలో మీ సానుకూల ఆలోచనను మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి లేకపోతే ఓ సమస్య మిమ్మల్ని చుట్టుముడుతుంది. విభిన్న ఆదాయ వనరులను పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి.
ధనుస్సు
ఉద్యోగులకు మంచి రోజు అవుతుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకునే అవకాశం వారికి లభిస్తే ఖచ్చితంగా నేర్చుకోండి. వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాన్నుంచి ఈ రోజు బయటపడతారు. కుటుంబ సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి లావాదేవీలు జరపాల్సి వస్తుంది. ముఖ్యమైన పని వాయిదా వేస్తే అది మీకు ఓ సమస్యగా మారుతుంది.
Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!
మకరం
ఈ రోజు విద్యార్థులకు మేధోపరమైన, మానసిక భారం నుంచి ఉపశమనం కలిగించే రోజు. వ్యాపార కార్యకలాపాల్లో ముందుంటారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నెట్ వర్క్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేసేవారికి ఈ రోజు మంచిరోజు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెరుగుతున్న ఖర్చుల్లో కొన్నింటిని అదుపుచేయాలి.
కుంభం
ఈ రోజు మీ సౌఖ్యాలు పెరుగుతాయి. మీ కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయపడవచ్చు. ఈ రోజు మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీ సన్నిహితులను అనుమానించవద్దు..అలా చేస్తే నష్టపోయేది మీరే.
మీనం
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. చిన్న ఫంక్షన్లో పాల్గొంటారు..కుటుంబ సభ్యులంతా సరదాగా ఉంటారు. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నవారికి త్వరలో మంచిరోజులు రాబోతున్నాయి. కొన్ని వ్యక్తిగత విజయాలు మీలో సంతోషాన్ని నింపుతాయి. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు పోగొట్టుకున్న ఓ వస్తువు తిరిగి పొందుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)