అన్వేషించండి

జూన్ 14 రాశిఫలాలు: ఈ రాశులవారు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

Horoscope Prediction 14th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రాశివారికి ఈరోజు శుభదినం. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

వృషభ రాశి

ఈ రోజు మీకు అనకూల ఫలితాలు లేవు. బంధువులతో విభేదాలు రావచ్చు. మొండి వైఖరిని అవలంబించకుండా ఉండాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు.

మిథున రాశి

ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. తలనొప్పితో ఇబ్బంది పడతారు. మైగ్రేన్ రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణం సమయంలో వాహనం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!

కర్కాటక రాశి

మీ బాధ్యతను ఇతరులపై రుద్దకండి. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. పనిలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఆదాయం వృద్ధి చెందుతుంది. సన్నిహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. 

సింహ రాశి

మీరు సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు.  వివాదాస్పద విషయాలకు పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. ఆర్థికంగా లాభపడతారు.  

కన్యా రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మాటపట్టింపులకు పోవద్దు. సమస్యలు పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు. అనుభవజ్ఞుల సలహాల నుంచి మీరు ప్రయోజనం పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. 

తులా రాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ లోలోపల ఏదో తెలియని భయం వెంటాడుతుంది.  మిమ్మల్ని మోసంచేసేవారు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త. కొత్త పనులు ప్రారంభించేందుకు తొందరపడొద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా మీరు అడుగువేయాలి.  

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆనందంగా ఉంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. జీవితం ఆనందంగా సాగిపోతుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి మంచి ఫలితం పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం - 140 రోజుల పాటూ ఈ రాశులవారిపై శని ప్రతికూల ప్రభావం!

ధనుస్సు రాశి

ఈ రోజు మీ ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  వ్యాపారంలో కొన్ని మార్పులుంటాయి. స్నేహతులకు సమయం కేటాయిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.  రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది.

మకర రాశి

ఈ రోజు పాత విషయాల గురించి ఆందోళనలు ఉంటాయి.  వైవాహిక జీవితంలో చికాకులుంటాయి. అతిగా ఆలోచించవద్దు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. 

కుంభ రాశి

ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. అతివిశ్వాసంతో తప్పులు చేసే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. 
 
మీన రాశి

ఈ రోజు కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంతో కలసి దూరప్రాంతం ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.  

Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Embed widget