Sun Transits Gemini 2024: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !
Sun Transits Gemini 2024: జూన్ 15 నుంచి సూర్యుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ రాశిలో సూర్యభగవానుడి సంచారం ఈ రాశులవారికి శుభ ఫలితాలనిస్తోంది. ఇందులో మీ రాశి ఉందేమో తెలుసుకోండి...
Sun Transits Gemini 15 June till 16 July 2024 : జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలకు రాజుగా చెప్పే సూర్యుడు శుభస్థానంలో సంచరిస్తే ఆ సమయంలో ఆయా రాశులవారని అదృష్టం వరిస్తుంది. వ్యక్తిగత, వృత్తి జీవితం మెరుగుపడుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి మిథునంలోకి అడుగుపెడతాడు..జూలై 16 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది...ఇదివరకూ ఉండే సమస్యల నుంచి ఉపశమనం కలిగించి సంతోషాన్నిస్తుంది. మరి మిథునంలో సూర్య సంచారం ఏ ఏ రాశులవారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి...
మేషరాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మిథునంలో సూర్య సంచారం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో చేసేపని విషయంలో ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తిచేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూల సమయం. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు.
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మీ రాశిలో సూర్యుడి సంచారం మీకు అపారమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెల రోజుల సమయంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు శుభసమయం..ఉన్నత ఉద్యోగం లేదంటే ప్రమోషన్ పొందుతారు. నూతన వ్యక్తులను కలుస్తారు..వారివల్ల లాభపడతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సూర్య సంచారం సింహరాశివారికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగుల ప్రమోషన్ పొందుతారు. శుభవార్తలు వింటారు..కుటుంబంతో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
విదేశీ వ్యాపారాలు చేసేవారికి జూన్ 15 నుంచి జూలై 16 వరకూ అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. మిథునంలో సూర్య సంచారం సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: మిథున సంక్రాంతి రోజు చేయాల్సిన దానాలేంటి - మూడు రోజుల వేడుకగా జరుపుకునే 'రాజా పర్బ' గురించి తెలుసా!
ధనస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మిథున రాశిలో సూర్యుడి గమనం ధనస్సు రాశివారి మంచి ఫలితాలనిస్తోంది. వృత్తి, ఉద్యోగాలలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా ఉంటారు...
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
జూన్ 15 నుంచి జూలై 16 వరకూ మీకు అదృష్టం మామూలుగా లేదు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నూతన వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయం. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు బాగా కలిసొస్తాయి. ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.