Horoscope Today 13th October 2022: ఈరోజు ఈ రాశివారు కొత్త ఆనందాన్ని అనుభవిస్తారు, అక్టోబరు 13 రాశిఫలాలు
Horoscope Today 13th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 13th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. అనుకున్న పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఎవ్వరి మాటల్ని లెక్కలోకి తీసుకోవద్దు..మీ మనసుకి అనిపించింది చేయండి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.
వృషభం
అనుకున్న సమయానికి ధనం చేతికందుతుంది. కష్టం పెరుగుతుంది కానీ అదే సమయంలో మీ గౌరవం కూడా రెట్టింపవుతుంది. స్నేహితుల సహాయంతో ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.
మిథునం
మీ అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ పన ిచేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఇనుము వ్యాపారం చేసేవారు లాబాలు పొందుతారు.
Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!
కర్కాటకం
ఆశించిన విజయాన్ని పొందడంతో మనసు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అనుకున్న పని పూర్తిచేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. మీ మాటలు వేరేవారు అపార్థం చేసుకోవచ్చు. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అనవసర వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేయకండి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.
సింహం
ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్నపనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యా
మీరు ఈ రోజు కొత్త ఆనందాన్ని అనుభవిస్తారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారు సంతోషంగా ఉండడం మీకు మరింత సంతోషాన్నిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు లేదంటే హాజరవుతారు.
తుల
కష్టపడి ముందుకు సాగడంతో మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఈ రోజంతా మీకు అనుకూలమైన ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు మంచి రోజు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి..మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!
వృశ్చికం
మీ పెద్దల నుంచి డబ్బులు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
ధనుస్సు
వ్యాపారంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం తగ్గడంతో పాటూ ఖర్చులు పెరగడం మిమ్మల్ని ఆందోళన పరుస్తుంది. మనసులో ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరగవచ్చు. స్నేహితుల పూర్తి మద్దతు ఉంటుంది.
మకరం
పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకోసం కొన్ని సమస్యలు వెయిటింగ్..ముందే జాగ్రత్తపడడం మంచిది. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
కుంభం
ఓపికగా వ్యవహరించండి. ఆదాయం తగ్గుతుంది..ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త..వైద్య ఖర్చులు పెరుగుతాయి. మనసులో ఏదో నిరుత్సాహం, అసంతృప్తి ఉంటుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది.స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది.
మీనం
మీ ఆరోగ్యం బాగుంటుంది..సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పనులన్నీ సకాలంలో పూర్తిచేయడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.