By: RAMA | Updated at : 13 Dec 2022 05:24 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 13th December 2022 (Image Credit: freepik)
Horoscope Today 13th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ జీవితం సంతోషంగా ఉండాలంటే మొండివైఖరి విడిచిపెట్టాలి. అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి. కార్యాలయంలో ఒత్తిడిని ఇంటికి మోసుకురావొద్దు. కుటుంబ సమయాన్ని వృధా చేయవద్దు
వృషభ రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి ప్రజలు తమ జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు
మిథున రాశి
మీ కుటుంబానికి సంబంధించిన సంక్లిష్టమైన విషయాలు సులభంగా పరిష్కరిస్తారు. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కచ్చితంగా మీ తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కర్కాటక రాశి
మీ అతిపెద్ద కల సాకారం అవుతుంది. కానీ మీ ఉత్సాహాన్ని నియంత్రించండి, ఎందుకంటే ఎక్కువ ఆనందం కూడా సమస్యను కలిగిస్తుంది. ఆదాయమార్గాలు పెంచుకునే ఆలోచనలు చేయడం మంచిది. మీ జీవిత భాగస్వామి సాధించిన విజయాలను అభినందించండి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యంలో ఒడుదుడుకులుంటాయి. ఆఫీసులో మీ పని తీరుకి ప్రశసంలు లభించవచ్చు. వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి. స్నేహితులను కలుస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీ గత పరిచయస్తులు అనుకోకుండా మిమ్మల్ని కలుస్తారు. కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తులా రాశి
మీ సానుకూల ఆలోచనకు ప్రతిఫలం లభిస్తుంది..మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యుల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. కోపాన్ని నియంత్రించండి
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మీరు కొందరు వ్యక్తులను కలుస్తారు వారి కారణంగా భవిష్యత్ లో లాభపడతారు.
ధనుస్సు రాశి
ఈ వారం మీరు అకాస్మాత్తుగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగం, విద్యా రంగాలలో కొత్త విజయాలను అందుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు.
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మకర రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన పెట్టుబడులకుదూరంగా ఉండడం మంచిది. చిన్న విషయాలపై ఇంటి సభ్యుల మధ్య మాటపట్టింపులు వస్తాయి..వాటిని మీరు సరిచేస్తారు. మీ ప్రియమైన వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు మీ దుస్తులు, ప్రవర్తనలో కొత్తదనాన్ని ఉంచండి. మీ కింది ఉద్యోగుల పనితీరు మిమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తుంది
కుంభ రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన రోజు. ఏదైనా పనిని ప్రశాంతమైన మనస్సుతో చేస్తే, మీరు ఖచ్చితంగా దాని ప్రయోజనాన్ని పొందుతారు. కుటుంబం యొక్క పూర్తి మద్దతుతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు కొన్ని శుభవార్తలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది
మీన రాశి
ఈ రోజు మీపై పని ఒత్తిడి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలొస్తాయి.
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు
Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు
ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?