Horoscope Today 13 December 2021: ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు ఈ రోజంతా కలిసొస్తుంది.. మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రేమికులకు మంచి రోజు. కుటుంబ సభ్యుతో సంతోషంగా ఉంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
వృషభం
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలొస్తాయి. మీరు ప్రేమించే వారితో వివాదాలు రాకుండా జాగ్రత్తపడండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వాహనం జాగ్రత్తగా నడపండి. ప్రమాద సూచనలున్నాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మిథునం
మిథున రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఆటపాటలతో మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలొస్తాయి. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అమ్మకాలు, కొనుగోలులో లాభాలు పొందుతారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు.
కర్కాటకం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇతరులకోసం అనవసర ఖర్చులు చేయొద్దు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు.
సింహం
ఆర్థికంగా కలిసొచ్చే సమయం. కుటుంబంలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాల్లో తలదూర్చొద్దు. కొత్తగా పరిచయమైన వారినుంచి సహాయం అందుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం.
కన్య
ఈ రోజంతా మీకు శుభసమయమే అని చెప్పుకోవచ్చు. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహా పాటించండి.
తుల
ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించండి.
వృశ్చికం
ఈ రోజు మీ శ్రమకు తగ్గ మంచి ఫలితం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వైవాహిక జీవితంలో సర్దుకుపోయేలా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నెమ్మదిగా సాగుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.
ధనుస్సు
ఈరోజు మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తప్పవు. వ్యాపారులు అనుకోని ప్రయాణాలు చేయొచ్చు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు మెరుగుపడతాయి.
మకరం
ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది..అప్పులు చేయకండి. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.
కుంభం
పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మీనం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. సన్నిహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది.
Also Read: కాళ్లకు మెట్టెలు పెట్టుకునేది పెళ్లైందో లేదో తెలుసుకునేందుకు కాదు..
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి