News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today 12th April 2023: ఈ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి, ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే కష్టం

ఈ రాశి వారికి కుటుంబంలోకి కొత్త సభ్యులు రాబోతున్నారనే వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్న వారు పెళ్లి నిశ్చయం చేసుకుంటారు.

FOLLOW US: 
Share:

మేషరాశి

ఇవ్వాళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే రోజు హాయిగా గడిచిపోతుంది. పెట్టుబడులకు అనువైన కాలం కాదు. ఆత్మీయులతో ఆనందంగా గడిపేందుకు అనువైన కాలం. స్నేహితుల్లోనూ, బంధుగణంలోనూ మీ పరపతిని పెంచే పనులు చెయ్యాలి. ఒక ప్రత్యేక వ్యక్తి దృష్టి లో పడతారు. మీ ప్రణాళికల గురించి చర్చించకండి, సంకల్పం నీరుగారి పోవచ్చు. కొత్త పరిచయాలు కొత్త కాంట్రాక్ట్ లకు దోహదం చేస్తాయి. ఆనందమయ దాంపత్య జీవితం అనుభవిస్తారు .

వృషభ రాశి

ఈ రోజు మీకు సెల్ఫ్ మోటివేషన్ అవసరం. భయం, ఈర్ష్యా, ద్వేషం వంటి నెగెటివ్ ఫీలింగ్స్ ను జయించాలి. రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు కానీ చివరకు లాభంతోనే రోజు ముగుస్తుంది. కొత్త ప్రాజెక్టులు ఖర్చులు వాయిదా వేసుకోవడం మంచిది. ఇన్నాళ్లు గా తీరికలేకుండా గడిపిన మీకు విశ్రాంతికి సమయం దొరుకుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

 మిథున రాశి

 ఈరోజు లౌక్యంతో వ్యవహరిస్తే మనసులో వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఎప్పటినుంచో తీర్చలేకపోతున్న అప్పులు, బకాయిలు తీర్చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుస్తుంది. ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోష సమయాన్ని పంచుకుంటారు.

కర్కాటక రాశి

స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. అనుకోకుండా డబ్బు వచ్చి పడుతుంది, ఖర్చులకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంచెం ఆందోళనకు గురిచెయ్యవచ్చు. కొత్త ప్రదేశాలు తిరగడానికి, ప్రయాణానికి అనువైన సమయం. ఈ ప్రయాణాలు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునేందుకు దోహదం చేస్తాయి. బంధువులతో వచ్చే తగాదాలు తాత్కాలికమే కానీ జాగ్రత్త అవసరం.

సింహరాశి

జీవితం పట్ల ఉదాత్త ధోరణి అవసరం. పరిస్థితులను బట్టి నిరాశ, దు:ఖం సహజమే కానీ ఇది తాత్కాలికమే అని గుర్తించండి. ఇప్పటి వరకు పొదుపుగా బతకని వారికి ఆర్థిక కష్టాలు తప్పవు. మీ విశ్వాసం మీ కేరీర్ మీద ప్రభావం చూపిస్తుందని మరచిపోవద్దు. పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో రోమాంటిక్ గా రోజు ముగుస్తుంది.

కన్యారాశి

కొద్దిపాటి ఒత్తిడి మినహా ఆరోగ్యం బావుంటుంది. ఎవరి సహకారం లేకుండానే డబ్బు సంపాదిస్తారు. సమయానికి మీరు అందించే సహాయం వల్ల ఒకరికి చాలా మేలు జరుగుతుంది. పనిచేసే చోట మీదే పైచేయిగా ఉంటుంది. కొంచెం బద్దకం వేధిస్తుంది. భాగస్వామితో ప్రేమ పూర్వక సమయం గడుపుతారు.

తులా రాశి

మీరు చాలా ధైర్యంగా బలంగా ఉండాల్సిన రోజు ఇది. పాత జ్ఞాపకాలు వేధిస్తాయి. కానీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు. దగ్గరి వారి సలహాలు వ్యాపారలాభాలకు దోహదం చేస్తాయి. మీ హ్యూమర్ చుట్టూ ఉన్న వారిని ఎంటర్టైన్ చేస్తుంది. మీ రెస్యూమ్ పంపేందుకు లేదా ఇంటర్వ్యూ లకు అనుకూల కాలం. సరదాలకు వినోదాలకు మంచిరోజు.

వృశ్చిక రాశి

మంచి ప్లానింగ్ తో సమయానికి ముందే పనులు ముగిస్తారు. కుటుంబంలోకి కొత్త సభ్యులు రాబోతున్నారనే వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్న వారు పెళ్లి నిశ్చయం చేసుకుంటారు. ఆఫీసులో జాగ్రత్తగా, తెలివిగా మసలుకోండి. కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నిస్తారు. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ధనస్సు రాశి

ఇవ్వాళ అవుట్ డోర్ లో ఆడే మూడ్ ఉంటుంది. ధ్యానం, యోగా మీద దృష్టి పెడతారు. మొండి బాకీలు వసులవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చెడు అలవాట్లు మానుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడే సమయంలో శ్రద్దగా వినండి. మొత్తంగా లాభదాయకమైన రోజు.

మకర రాశి

హైప్రొఫైల్ వ్యక్తులను కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం అవసరం తెలివిగా మదుపు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. వైవాహిక జీవితం అద్భుతంగా గడుస్తుంది ఈ రోజు.

కుంభ రాశి

స్నేహితుల సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ డబ్బు ఖర్చయ్యే విధానాన్ని ఒకసారి గమనించి చూసుకోవడం అవసరం. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతారు. కుటుంబానికి సమయం కేటాయించడం మాత్రమేకాదు ఆవిషయం వారికి అర్థమయ్యేట్టు ప్రవర్తించండి. పని చేసే చోట సీనియర్ల ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఆనంద సమయం గడుపుతారు.

మీన రాశి

ఆరోగ్యానికి ఢోకా లేదు. డబ్బు ఖర్చు చేసే సరైన విధానం నేర్చుకుంటారు. ఇంటి అలంకరణలో సమయం గడుపుతారు. మీ ప్రతిష్ట కు భంగం కలిగే వారితో, అలాంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. మీకు ఇదొక రొమాంటిక్ రోజు. మీ భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు.

Published at : 12 Apr 2023 05:00 AM (IST) Tags: astrology in telugu rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today 12th April Horoscope 12th April Astrology Today Astrology in Telugu

సంబంధిత కథనాలు

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!

Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు  దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!

మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు

మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ