మార్చి 10 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ఏదో జరుగుతోంది, నిందలు పడాల్సి ఉంటుంది జాగ్రత్త!
Rasi Phalalu Today 10th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారు కొత్త స్నేహితులను పొందుతారు. ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు క్రీడలు సహాయపడతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం బాగాసాగుతుంది
వృషభ రాశి
మీకు తెలియకుండా మీరు కొన్ని విషయాల్లో నష్టపోతారు. ఆనందం కోసం ఖర్చులు ఎక్కువ చేస్తారు..ఆ తర్వాత బాధపడతారు. అయితే శత్రువుల విషయంలో మాత్రం అలెర్ట్ గా ఉంటారు. ఉద్యోగులు పని విషయంలో రాజీ పడరు. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి ఈరోజు ఆలోచించకపోవడమే మంచిది
మిథున రాశి
ఈ రోజు మీ వర్క్ కి కొంత అంతరాయం ఏర్పడుతుంది. చేయాలనుకున్న పనిని మంచి మార్గంలో చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.ఎదుటివారికి దిశానిర్ధేశం చేయవద్దు. పని విషయంలో మీరు చేయాల్సింది చేయండి. ఈ రోజు కాస్త ఓర్పుగా వ్యవహరించాలి. విద్యార్థులు కష్టపడాలి.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రేమ జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తలెపెట్టిన కొన్ని పనులు ఆగిపోవచ్చు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఓ శుభకార్యానికి హాజరవుతారు.
సింహ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుటుంబంలోని చిన్న పిల్లల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. మీపట్ల కుటుంబ సభ్యులకు ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతావకాశాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి
కన్యా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో అకస్మాత్తుగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. రోజువారీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేస్తారు. ఎనర్జిటిక్ గా ఫీలవుతారు.నిజాయితీగా వ్యవహరించండి.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
తులా రాశి
మీరున్న వృత్తిలో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంతానం వైపు నుంచి సంతోషం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు తెలియకుండానే మీపై నిందలు పడే ప్రమాదం ఉంది కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళనలు కూడా పెరుగుతాయి. కొంతమంది ప్రత్యర్థులు మరింత చురుకుగా మారవచ్చు..మీకు హాని కలిగే ప్రమాదం ఉంది జాగ్రత్త. కుటుంబ వాతావరణం బావుంటుంది
ధనుస్సు రాశి
ఈ రోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు.ఉద్యోగులకు సన్నిహితుల నుంచి సహకారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రోజు మీరు కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. రాష్ట్ర ఉద్యోగులకు ఉద్యోగంలో కొన్ని మార్పులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఆలోచనల్లో కొత్తదనం ఉండొచ్చు. ఈ రోజు మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి.
కుంభ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. నదీతీరానికి కానీ సముద్రతీరానికి కానీ వెళతారు. ఈ ప్రయాణం మనసును ఆనందపరుస్తుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలవడం భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు కొత్త పనుల్లో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారులకు శుభదినం