అన్వేషించండి

Horoscope 10th February 2024: ఈ రాశులవారికి చాలా చాలా ప్రోత్సాహకరమైన రోజు ఇది, ఫిబ్రవరి 10 రాశిఫలాలు

Horoscope 10th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 10th February 2024  - ఫిబ్రవరి 10 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

మేషరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పనిపట్ల పూర్తి అంకితభావంతో ఉంటారు. కుటుంబంలో సంతోష సమయం గడుపుతారు. మీరు కలిసే కొత్త వ్యక్తుల నుండి మీ ఉత్తమ అవకాశాలు కొన్ని వస్తాయి. వైవాహిక జీవితం బావుంటుంది

వృషభ రాశి (Taurus  Horoscope Today)

వృషభ రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది.  కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టవలసి రావచ్చు. కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.  చిన్న గొడవ తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తుంది జాగ్రత్త. మీ సంబంధంలో బయటి వ్యక్తి ప్రమేయం మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఆర్థకి పరిస్థితి బావుంటుంది. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

మిథునరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ప్రారంభించే పనిలో విజయం సాధిస్తారు. మీ మనోబలం కూడా పెరుగుతుంది.   ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని భావిస్తారు. కుటుంబ సబంధాలు దృఢంగా ఉంటాయి.  ఈ రోజు మీరు మీ పిల్లల నుంచు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. 

Also Read: కాకిలో ఇన్ని మంచి లక్షణాలున్నాయా - మీరు చాలా ఆశ్చర్యపోతారు!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

కర్కాటక రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ వ్యూహాత్మక స్థానం బలపడుతుంది. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి. అనవసర విషయాలపై ఎక్కువ చర్చలు పెట్టొద్దు. నూతన ఆదాయ మార్గాలు మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఇబ్బందులుంటాయి.  వివాహ ప్రతిపాదన కోసం వేచి ఉన్న వ్యక్తులకు గుడ్ టైమ్. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహ రాశి (Leo Horoscope Today)

సింహరాశి వారికి ఈ రోజు కష్టతరమైన రోజు. రిస్క్ చేయవద్దు. మీరు మీ చర్యలపై దృష్టి పెట్టాలి. బంధంలో అపశ్రుతులు ఉంటే ప్రశాంతంగా ఉండండి. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి  మీ భాగస్వామిని గౌరవించండి. మీ వ్యూహాత్మక స్థితిని మెరుగుపరచుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. పనిపట్ల మీకున్న నిబద్ధత కార్యాలయంలో మీ గౌరవాన్ని పెంచుతుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు కన్యారాశి మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అవసరమైన బట్టలు లేదా సామగ్రిని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు.  మీ కుటుంబం, స్నేహితులు మీకు సహకారం అందిస్తారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కొన్ని సంబంధాలు చెడిపోవచ్చు కానీ ఈరోజు విడిపోవడానికి అవకాశం ఉండదు. ఏదైనా ప్రతిపాదనకు ఈ రోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల సమస్యలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపనివ్వవద్దు.  ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. 

Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు తులారాశి వారికి మంచి రోజు అవుతుంది. మీరు పనిలో విజయం పొందుతారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు , స్నేహితులు  మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. అదనపు బాధ్యతలు అందుకుంటారు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు వృశ్చికరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీరు కొంత కష్టపడవలసి రావొచ్చు ..చేపట్టిన పని పూర్తయ్యేందుకు టైమ్ పడుతుంది. మీ ఆరోగ్యంపై, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యలు ఉండవు. ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యం మరియు డబ్బుకు సంబంధించిన విషయాలపై సంపూర్ణ అవగాహన వచ్చాకే మాట్లాడండి. కార్యాలయంలో మీ సామర్థ్యం నిరూపించుకునే అవకాశం వస్తుంది..వాటిని ఎంత బాగా ఉపయోగించుకుంటారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు ధనుస్సు రాశి వారికి అనుకూలమైన రోజు.  ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల పొందుతారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఏదో కొత్త శక్తి వచ్చినట్టు ఫీలవుతారు. అహంకారాన్ని దూరం చేయండి. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు.  ఏదైనా సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. పొదుపు పై దృష్టి సారించాలి.

Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!

మకర రాశి (Capricorn Horoscope Today) 

మకర రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు కొంచెం కష్టపడవలసి రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు .  ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  మీ విధానంలో సానుకూలంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మంచి రోజు. ఆర్థిక సంక్షోభం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ తీవ్రమైన పరిస్థితి తలెత్తదు. స్నేహితులు , తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. ఈ రోజు మీరు స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు మంచి రోజు. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుంభ రాశి వారికి ఈ రోజు ప్రోత్సాహకరమైన  రోజు.  నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం పొందుతారు. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు ఈరోజు కుటుంబ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు...ఎదుటి వ్యక్తి చెప్పేది ఓపికగా వినడం ద్వారా ఈ సమస్యని సులభంగా పరిష్కరించవచ్చు.  పిల్లలకు సమయం కేటాయించాలి. 

Also Read: ఈ ఏడాది 3 నెలలు మూఢం, ఈ టైమ్ లో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదు!

మీన రాశి (Pisces Horoscope Today) 

మీనరాశి వారికి ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటారు కానీ నూతన వ్యవహారాలకు ఈ రోజు మీకు మంచిది కాదు. మీ లక్ష్యాలపై శ్రద్ధ చూపించడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబానికి సమయం కేటాయించాలి. కార్యాలయంలో మంచి పనితీరు మంచి ఫలితాలన్ని పొందుతారు

గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget