అన్వేషించండి

Horoscope Today 10th February 2023: ఫిబ్రవరి, 10 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు లక్కీ డే, అన్నీ మంచి శకునాలే!

Rasi Phalalu Today 10th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 10, 2023, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశితో సహా అన్ని రాశుల వారు ఆనందం, శ్రేయస్సు పొందుతారు. ఈ రోజు ఎవరు విజయం సాధిస్తారు, మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు మేలు జరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన ప్రయోజనం చేకూరుతుంది. మీపై మీకు మరింత నమ్మకం ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకుప్లాన్ చేస్తారు. మీ మనసుకు శాంతి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరోద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి గౌరవం దక్కుతుంది. ప్రేమికులు ఈ రోజు హ్యాపీగా ఉంటారు.

వృషభ రాశి

ఈ రాశివారికి ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. కార్మికులు బకాయిలో ఉన్న జీతాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కొత్త వస్తువుల కోసం షాపింగ్ చేయవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఇతరులకు కూడా మీరు సాయం చేస్తారు. ఆధ్యాత్మికత వైపు పయనిస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సీనియర్ సభ్యుల ఆశీస్సులతో కొత్త పనులు ప్రారంభించగలరు. రాజకీయాల్లో రాణించాలని కలలుగనే యువతకు ఈ రోజు బాగుంటుంది. ప్రేమికులు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారు. ఇంటికి కొత్త అతిథి వస్తారు. ఫలితంగా కుటుంబ సభ్యులు సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేయొచ్చు. 

మిధున రాశి

ఈ రాశి వారికి కూడా ఈ శుక్రవారం మంచి రోజే. వ్యాపారం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పని ప్రాంతంలో కొన్ని విధానాలు, నియమాలను అనుసరించాలి. లేకుంటే పెద్ద గందరగోళం ఏర్పడవచ్చు. ఉద్యోగం మార్పుపై ఆచీతూచి నిర్ణయం తీసుకోవాలి. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టేవారికి స్నేహితుల మద్దతు దొరుకుతుంది. మీరు స్నేహితులతో పార్టీకి హాజరవుతారు. అక్కడ మీరు మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ఆ వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు.  మీకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్‌కి వెళ్లవచ్చు. మీరు పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతారు. 

కర్కాటక రాశి 

ఈ రాశివారికి ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. గృహ నిర్మాణ రంగంలో విజయం సాధిస్తారు. కొత్త వాహనం కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇల్లు, దుకాణం మొదలైనవాటిని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. మీకు కార్యాలయంలో ఏదైనా బాధ్యతాయుతమైన పని అప్పగిస్తే, మీరు దానిని బాగా నిర్వహించేందుకు ప్రయత్నించాలి. లేకపోతే మీ సీనియర్ల ఆగ్రహాన్ని చూడవచ్చు. వ్యాపారస్తులు నిలిచిపోని పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యం, ప్రశాంతత కోసం యోగా, ధ్యానాన్ని అలవరుచుకోవాలి. ఆన్‌లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీరు మీ పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.  

కన్య రాశి

ఈ రాశివారికి కూడా ఈ రోజు బాగుంది. వ్యాపారస్తులు పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో ఇతరులను గుడ్డిగా విశ్వసించడం మానుకోవాలి. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ రోజు ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఈ రోజు సాఫీగా సాగుతుంది. రాజకీయాల్లోకి చురుగ్గా ఉండే యువతకు ఈ రోజు మంచిదే. ఈ రాశివారు ఈ రోజు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలున్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మంచి వైద్యుడిని సంప్రదించండి. నిరుద్యోగులైన యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. అయితే వీరు తప్పకుండా ప్రయత్నాలు చేయాలి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. మీరు ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు దాని పూర్తి ప్రయోజనం మీకు లభిస్తుంది. ఆదాయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

తులారాశి

ఈ రాశివారికి కూడా ఈ రోజు సాఫీగా సాగుతుంది. వ్యాపారస్తులకు తగిన లాభాలు వస్తాయి. ఫలితంగా ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు.  ఈ రోజు మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి. మీ ఇష్టానికి విరుద్ధంగా కూడా మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇంటి అలంకరణ కోసం కూడా ఈ రోజు షాపింగ్ చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నత స్థానం కోసం ఉద్యోగాన్ని మారే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ వహించాలి. అప్పుడే పరీక్షలో మంచి మార్కులు సాధించగలరు. మిత్రుల ద్వారా ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఖర్చును నియంత్రించండి. ఎన్నాళ్ల నుంచో ప్రయత్ని్స్తున్న మొండి బకాయిలు మీ చేతికి రావచ్చు. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. విద్యా కార్యాలలో విజయం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలు గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళనగా కనిపిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. మీరు పిల్లలతో కొంత సమయం గడుపుతారు. 

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మీకు ఖర్చులు కొన్ని పెరగవచ్చు, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సమస్యలను కలిసి కూర్చొని పరిష్కరించుకుంటే మంచిది. స్నేహితుల ద్వారా మీకు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపార సంబంధిత ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రామికులకు అధికారుల సహకారం లభిస్తుంది. మీరు ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. ప్రేమ ఫలించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీలో విజయం సాధిస్తారు. మీ ఇంటికి కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

ధనుస్సు రాశి

ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచి రోజు కానుంది. వ్యాపారస్తులు శుభవార్త వింటారు. ఉద్యోగంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. మీరు మీ అత్తమామల వైపు నుంచి కూడా ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. రేపు మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు, దాని కారణంగా మీరు గర్వపడతారు. రేపు మీరు మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని ఇంట్లోంచి వెళితే మీ పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మీ ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. ప్రభుత్వ పథకాలు అందుతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఫలితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. దీని కారణంగా మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. తోబుట్టువుల ఉన్నత విద్య కోసం మీరు డబ్బును పెట్టుబడి పెడతారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతారు. కాస్త శ్రమిస్తే మంచి ఫలితాలు చూస్తారు. 

మకర రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆర్థికపరంగా సమస్యలేవీ ఉండవు. అయితే, మీరు మీ తప్పుల నుంచి తప్పకుండా గుణపాఠం నేర్చుకోవాలి. లేకపోతే భవిష్యత్తుపై దాని ప్రభావం పడుతుంది.ఉద్యోగంలో ఏ నిర్ణయం తీసుకున్నా గందరగోళానికి గురవుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. రేపు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, అక్కడ మీరు చురుగ్గా పాల్గొంటారు. అక్కడ కొంత సమయం వెచ్చిస్తారు. కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. దాని కోసం వారు తమ పరిచయస్తులతో మాట్లాడతారు. విద్యార్ధులు విద్య కోసం ఒక నగరం నుండి మరొక నగరానికి కూడా వెళ్ళవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కానీ కొంతమంది దీనివల్ల అసంతృప్తిగా కనిపిస్తారు.  

కుంభ రాశి

ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల నుండి కొన్ని వార్తలను వింటారు. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభమవుతాయి. దాని వల్ల మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడి ప్రణాళికలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టవద్దు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఇల్లు, దుకాణం మొదలైనవి కొనాలనే మీ కల ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. మీరు మీ ఇంటికి కొత్త వాహనాన్ని కూడా తీసుకువస్తారు. దాని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ బిడ్డకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దానివల్ల మీరు చాలా సంతోషంగా కనిపిస్తారు. మిత్రుల ద్వారా ఆదాయ అవకాశాలు లభిస్తాయి.

మీన రాశి

ఈ రాశివారికి ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో అంతా కలిసి షాపింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాల సంకేతాలు ఉన్నాయి. మతపరమైన పనులలో బిజీగా ఉంటారు. కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహారానికి వెళ్లేందుకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, అందులో సానుకూల ఫలితాలను పొందుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Embed widget