News
News
X

Horoscope Today 1 December 2022: మూడోవ్యక్తి జోక్యంతో ఈ రాశివారి జీవితంలో కలతలు, డిసెంబరు 1 రాశిఫలాలు

Horoscope Today 1 December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 1 December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరులను ఆకట్టుకోవడానికి అధికంగా ఖర్చు చేయొద్దు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అనవసర చర్చల్లో సమయాన్ని వృథా చేయడం కంటే ప్రశాంతంగా ఉండడం మేలు. వివేకవంతమైన చర్యల ద్వారానే మనం జీవితానికి ఓ అర్థం ఉంటుందని గ్రహించాలి

వృషభ రాశి
కుటుంబ సభ్యుల్లో కొందరి అసూయ స్వభావం మీకు చికాకు కలిగిస్తుంది..కానీ మీరు వివేచన కోల్పోవద్దు. లేదంటే పరిస్థితి అదుపు తప్పుతుంది. కొన్నింటిని మెరుగుపర్చలేరు వాటిని అంగీకరించడమే మంచింది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

మిథున రాశి
దీర్ఘకాలంగా ఉన్న రోగాలు దూరమవుతాయి. భాగస్వామ్య వ్యాపారం, ఆర్థిక పథకాలలో పెట్టుబడికి ఇది మంచి సమయం కాదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి విషయాలు ఈ రోజు పూర్తవుతాయి. 

కర్కాటక రాశి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపం ప్రదర్శించవద్దు. ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు మంచి సమయం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు. 

Also Read: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

సింహ రాశి
ఈ రోజు పనిభారం కొంత ఒత్తిడికి, చిరాకును కలిగిస్తుంది. డబ్బు ఆదాచేయడానికి ఇంట్లో పెద్దల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

కన్యా రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అదనపు ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టొచ్చు. వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పని ఒత్తిడిని జయిస్తారు. నిరుద్యోగులకు మంచి సమయం. ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. 

తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. సమయానికి,డబ్బుకి విలువ ఇవ్వండి...లేదంటే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు. కుటుంబ జీవితం బావుంటుంది. సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి
ఇతరుల విజయాన్ని మెచ్చుకోవడం ద్వారా మీరు ఆనందిస్తారు. పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తమ శక్తిని మించిన వాగ్దానాలు చేస్తారు. మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు చెడుచేసేవారే..వారిని గుర్తించి దూరంగా ఉండడం మంచిది. ఒకరి జోక్యం కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో కలతలు వస్తాయి.

ధనుస్సు  రాశి
ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి రోజు మంచిది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకానికి ఈ రోజు మంచిరోజు. మీరు మీ ఇంటి బాధ్యతలను విస్మరించడంతో ఇంట్లో వారి కోపానికి గురవుతారు.  

Also Read: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

మకర రాశి
మీ అదనపు శక్తిని  అందరి ప్రయోజనం కోసం సానుకూలంగా ఉపయోగించాలి. ఉద్యోగులు పనిని శ్రద్ధగా చేయాలి. వ్యాపారులు అప్పులు ఇవ్వొద్దు. ఇంట్లో చిన్న సమస్య కూడా పెద్దగా చేసేవారున్నారు జాగ్రత్త. 

కుంభ రాశి
ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. అనుకోని ఖర్చులు పెరిగి మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి సంతోషం, దుఃఖంలో పాలుపంచుకోండి. మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లేటప్పుడు మీ దుస్తులు, ప్రవర్తనలో వినూత్నంగా ఉండండి.

మీన రాశి
ధ్యానం, యోగా మీకు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా భౌతికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  పిల్లలు చదువుపై దృష్టి సారించి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 01 Dec 2022 05:18 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 1 December 2022 Astrological prediction for December 1 astrological predictions 1 December Rashifal

సంబంధిత కథనాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

టాప్ స్టోరీస్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబు అంటున్న మంత్రి కేటీఆర్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!