News
News
X

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Astrology: ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు...పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి డిసెంబరులోో పుట్టినవారెలా ఉంటారంటే...

FOLLOW US: 
Share:

Facts About People Born in December:  డిసెంబరులో పుట్టినవారు పుట్టుకతోనే టీచర్లు అన్నట్టుంటారు. తమ జ్ఞానాన్ని పంచుకుంటారు. ఎదుటివారు తప్పుగా ప్రవర్తించినప్పుడు వారిని వారు ఎలా మెరుగు పర్చుకోవాలో లేదా ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో సూచిస్తారు. ఇదంతా యాజమాన్య ధోరణితో కాకుండా స్నేహభావంతో చెబుతారు. ఇంకా డిసెంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

Also Read: మరణం సమీపించే ముందు సంకేతాలివే, స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి!

 • ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ న్యాయంగా, విశ్వసనీయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు
 • వీరిపై ఏదీ, ఎవరూ కూడా ఎలాంటి ప్రభావం చూపించలేరు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేసినా అది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదై ఉంటుంది
 • డిసెంబరులో జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతంగా ఉంటారు, పనిపట్ల అంకిత భావంతో వ్యవహరిస్తారు. వీరికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి
 • వీరు చాలా తెలివైనవారు,  ఏ విషయాన్ని అయినా లోతుగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు
 • కొత్త వ్యక్తులను కలుస్తారు, వివిధ సంస్కృతులను తెలుసుకుంటారు. బోధించేందుకు ఎంత ఉత్సాహంగా ఉంటారో..నేర్చుకోవడంలోనూ అంతకుమించి అనిపిస్తారు
 • కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటినుంచి దూరంగా పారిపోరు
 • జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారో, ప్రాధాన్యతలేంటో తెలుసు. వీరికి ప్రత్యేకమైన కోరికలంటూ ఉండవు. సంతోషం అంటే కుటుంబం, సన్నిహితులు, ప్రేమించినవారు..వీరి సామ్రాజ్యం ఇంతే.
 • డిసెంబరులో జన్మించిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు
 • వీరు కొన్ని నియమాలకు,నమ్మకాలకు కట్టుబడి ఉండడం వల్ల దాన్నుచి వీరిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. అందుకే అందరి దృష్టిలో మెండివాళ్లుగా పేరుపడతారు. కానీ ఆ మొండితనంలో కూడా ఎలాంటి స్వార్థ్యం ఉండదు
 • డిసెంబరులో జన్మించినవారు నిజాయితీగా, న్యాయంగా,  విధేయులుగా ఉంటారు
 • డిసెంబరులో పుట్టినవారు మంచి విద్యావంతులు, దయగలవారు, బుద్ధిబలము, దైవభక్తి కలిగి ఉంటారు
 • వీరి ప్రవర్తన చాలా బావుంటుంది. బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, బాగా సంపాదిస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు, నలుగురిలో గౌరవంగా బతుకుతారు.
 • పట్టుదల ,కార్యదీక్ష కలిగి ఉంటారు, తలపెట్టిన పని పూర్తిచేస్తారు
 • వీరికి అదృష్టంతో పాటూ దైవసహాయం కూడా తోడుంటుంది, భక్తిమార్గాన్ని అవలంభిస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, ప్రయాణాలమీద ఆసక్తి ఉంటుంది
 • ఈ నెలలో పుట్టినవారు మంచి ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాల్లో రాణిస్తారు, వీరిలో కొందరు పండితులు, విద్యావంతులుగా ఉంటారు
 • చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. పనిపై భక్తి, శ్రద్ధ రెండూ ఉంటాయి..ఆ పని పూర్తయ్యేవరకూ మరో పని గురించి ఆలోచించరు
 • ఏకాగ్రత ఎక్కువ, బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది, ఎలాంటి విషయాన్ని అయినా సులభంగా గ్రహించగలరు , అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు
 • వీరికి సహనం చాలా తక్కువ, నీతి నిజాయితీ, మాటపట్టింపు చాలా ఎక్కువ
 • కానీ కొన్ని పరిస్థితులకు తలవంచాలంటే బాధపడతారు
 • వ్యాపారాలు బాగా నిర్వహిస్తారు, స్వయంకృషిని సొంత తెలివితేటల్ని నమ్ముకుంటారు
 • వారి పనిని వారే స్వయంగా చేస్తారు, ఇతరులు చేస్తే వారికి నచ్చదు

Also Read: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 30 Nov 2022 06:57 AM (IST) Tags: Astrology Zodiac Months characteristics of December born Fascinating Facts About People who Born in December

సంబంధిత కథనాలు

Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్