అన్వేషించండి

Horoscope Today 08 June 2024: నూతన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలన్న ఈ రాశివారి కల నెరవేరే సమయం వచ్చేసింది - జూన్ 08 రాశిఫలాలు!

Horoscope Prediction 8th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేషరాశి

ఈ రోజంతా మీకు సందడిగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా కష్టపడతారు. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీ సహోద్యోగుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని పనులు పూర్తికాకపోవడం వల్ల మీ మనస్సు కొద్దిగా కలత చెందుతుంది. కొత్తగా పెళ్లయిన వారు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సమస్యలగురించి చర్చిస్తే పరిష్కారం అవుతాయి. 

వృషభ రాశి 

ఈ రోజు మీకు కొన్ని కొత్త పనుసు చేయడానికి మంచి రోజు. ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే మోసపోతారు. కుటుంబంలో అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.  

మిథున రాశి

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని ఈ రోజు పూర్తిచేస్తారు. నూతన ఆస్తి కొనుగోలు చేయాలన్న మీ కల నెరవేరుతుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచే వనరులపై పూర్తి శ్రద్ధ చూపిస్తారు. పని చేసే ప్రదేశంలో ఏదైనా పొరపాటు చేసిఉంటే మీకు మీరుగా క్షణాపణలు చెప్పడం మంచిది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

Also Read: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!

కర్కాటక రాశి

ఊద్యోగులకు ఈ రోజు మంచిరోజు అవుతుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినాల్సి రావొచ్చు. ఉద్యోగులు సహోద్యోగులపై చికారు పడొద్దు. దాన ధర్మాలు చేయడం వల్ల మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది. పురోగతికి కొత్త మార్గాలు కనిపిస్తాయి కానీ మీరు పాత తప్పిదాల గురించి ఆందోళనచెందుతారు. ప్రయాణాలలో కొత్త సమాచారం వింటారు.

సింహ రాశి

ఈ రోజు మీకు సమస్యలతో కూడిన రోజుగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు కార్యాలయంలో మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతారు. ఎవరినైనా వ్యాపారంలో భాగస్వామిని చేస్తే జాగ్రత్తగా ఉండాలి వారి చేతిలో మీరు మోసపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకోవచ్చు. ఉద్యోగులు ఇచ్చే సలహాలు ఉన్నతాధికారులకు ప్రయోజనకరంగా ఉంటాయి. 

కన్యా రాశి 

ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభిస్తే కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ప్రభుత్వ పథకాలతో డబ్బు పెట్టుబడి పెట్టినట్టైతే దాన్నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలను పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్న మీ కల నెరవేరుతుంది. 

తులా రాశి

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. న్యాయపరమైన విషయాలు కొనసాగుతున్నట్టైతే వాటి నుంచి రిలీఫ్ లభిస్తుంది. కుటుంబంలో ఉండే ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. వ్యాపారంలో నూతన మార్పులు చేస్తారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థుల చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. వ్యాపార సంబంధిత పర్యటనకు వెళ్లాల్సి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు గతంలో చేసిన వాగ్ధానాలు నెరవేర్చాల్సి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులు మిమ్మల్ని స్వార్థపరులుగా భావిస్తారు. వ్యాపారులు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు..తిరిగి పొందడం కష్టమవుతుంది. 

ధనస్సు రాశి

ఈ రోజు మీకు ఆందోళనలతో కూడిన రోజుగా ఉంటుంది. వ్యాపార పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. కుటుంబంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఓ శుభవార్త అందుతుంది. మీ పనిలో కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారు.పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు. పిల్లలపై శ్రద్ధ వహించండి.  

మకర రాశి

ఈ రోజు మీకు ఆరోగ్యం పరంగా బలహీనమైన రోజు. పాత జబ్బులు ఏవైనా మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. పని విషయంలో రాజీ పడొద్దు, తొందరపాటు వద్దు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటారు. 

కుంభ రాశి

ఈ రోజు చేపట్టే పనిలో ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏదైనా పని మళ్లీ ప్రారంభించవచ్చు. మీరు ఇంతకుముందు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే దాన్నుంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు పెద్ద బాధ్యతను పొందుతారు.

మీన రాశి

స్నేహితులతో లావాదేవీలేమైనా చేస్తే ఆ విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులుంటాయి. ఓ పెద్ద ఒప్పందం మీ చేతుల్లోంచి జారిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. విద్యార్థులకు చదువుపై కన్నా ఇతర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Embed widget