అన్వేషించండి

సెప్టెంబరు 4 రాశిఫలాలు - ఈ రాశులవారు రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 04 September 2023

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు  మంచిరోజు. భవిష్యత్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ ఉన్నతికి సంబంధించిన సమచారం వింటారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడితో కూడి ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ఓ బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. 

మిథున రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈ రోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల చర్యల వల్ల సమస్యలు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఓ స్నేహితుడి ద్వారా మీరు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి లక్కు కలిసొస్తుంది - సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు

కర్కాటక రాశి
ఈ రాశివారు ప్రవర్తనలో మార్పులును గుర్తిస్తారు.  కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఏదైనా తప్పుచేస్తే ఈ రోజు మీరు రియలైజ్ అవుతారు. ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.

సింహ రాశి
ఈ రాశివారు ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే పాటించేయడం సరికాదు. ప్రయాణంలో బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో వ్యాపారం గురించి చర్చిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాకే కొత్త ప్రయత్నాలు ప్రారంభించండి.  రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆదాయం బాగానే ఉంటుంది..అయితే అవసరానికి మించి ఖర్చు చేయకండి. విద్యార్థులు లాభపడతారు. స్నేహితుల భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు పనికి తగిన గుర్తింపు పొందుతారు.

తులా రాశి
తులా రాశివారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ఏదో తెలియని భయంతో బాధపడతారు. ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. రహస్య విషయాలను బయపెట్టడం సరికాదు. మీ ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సున్నిత స్వభావాన్ని ఆసరాగా చేసుకునేవారున్నారు జాగ్రత్త. వృత్తి గురించి ఆందోళన ఉంటుంది.

మకర రాశి 
ఈ రోజు మకర రాశి వారికి మిశ్రమ రోజుగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుతాయి. ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదానికి దూరంగా ఉండాలి.

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

కుంభ రాశి 
కుంభరాశి వారి జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుతాయి. కెరీర్‌కు సంబంధించి శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది

మీన రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ రహస్య విషయాలు ఎవరికీ చెప్పకపోవడమే మంచిది.  మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget