అన్వేషించండి

horoscope prediction in telugu 4 july 2024: ఈ రాశులవారు షేర్ మార్కెట్లో లాభపడతారు , ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది - జూలై 04 రాశిఫలాలు

Horoscope Prediction 4th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూలై 04 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు ఏదో ఒక విషయంలో టెన్షన్ ఉండవచ్చు. మీ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళనలు ఉండవచ్చు. ఎవరికీ సలహా ఇవ్వకండి.

వృషభ రాశి

ఈ రోజు మీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి

కుటుంబ వివాదాల కారణంగా మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండవచ్చు. మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. మీ లోపాలను ఎవరితోనూ చర్చించవద్దు. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమఫలితాలున్నాయి.

Also Read: ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ప్రయాణం చేయాలి అనుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల చదువుల విషయంలో నెలకొన్న ఆందోళనలు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి

సింహ రాశి

ఈ రోజు మంచి రోజు అవుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వివాహం చేసుకోవాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆశక్తి చూపిస్తారు. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

కన్యా రాశి

మీరు ఈ రోజు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో సమావేశమవుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 

Also Read: దాన వీర శూర 'కర్ణుడు' నిజంగా హీరోనేనా? విలన్ ని చేశారా..భీష్ముడు ఏం చెప్పాడంటే!

తులా రాశి

ఈ రోజు మీకు కొత్తగా పరిచయం అయినవారిపట్ల అప్రమత్తంగా ఉండండి. ఏ విషయాలు షేర్ చేసుకోవద్దు. ఓ గుడ్ న్యూస్ వింటారు. పనిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతి పొందుతారు.  

వృశ్చిక రాశి 

ఆలోచించకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

ధనుస్సు రాశి

మీ సమస్యలకు ఇతరులను బాధ్యులను చేయవద్దు. షేర్లు , స్టాక్ మార్కెట్ల నుంచి  ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం పొందుతారు. పాత అప్పులు తీర్చేస్తారు.

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మకర రాశి

అధిక ఖర్చుల కారణంగా ఒత్తిడి ఉంటుంది. ఏదో విషయంలో బాధపడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో పరుషంగా మాట్లాడవద్దు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. 

కుంభ రాశి
 
ఈ రోజు మీ ఆలోచనల్లో అనుకూలత ఉంటుంది. నచ్చిన వంటకాలు ఆస్వాదిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆదాయం , ఆరోగ్యం బావుంటుంది. 

మీన రాశి

మీకు కొత్తగా పరిచయం అయినవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. విదేశీ పర్యటనలకు ప్లాన్ చేసుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.  

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Embed widget