మార్చి 8 రాశిఫలాలు, ఈ రాశివారి కుటుంబంలో నెలకొన్న గందరగోళం హోలీ రోజు తొలగిపోతుంది
Rasi Phalalu Today 8th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు మీ భాగస్వాముల కార్యకలాపాలను గమనించండి. ఈ రోజు శ్రమ ఎక్కువైనా అనుకున్న పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. వివాహితులకు ఈ రోజు చిరస్మరణీయమైన రోజు అవుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు స్నేహితులతో సరాదాగా గడుపుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు, మీ చుట్టూ ఉండేవారిని సంతోషంగా ఉంచుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
మిథున రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది . కుటుంబ సభ్యులు ఒకరి అవసరాలపై మరొకరు శ్రద్ధ వహిస్తారు. పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మీ నుంచి ఓటమిని అంగీకరిస్తారు..మీ ఆధిపత్యం కొనసాగుతుంది.
Also Read: రాశిచక్రం ఆధారంగా మహిళల స్వభావం, ఈ రాశి స్త్రీల మనస్సులో ఏముందో ఎవ్వరూ గ్రహించలేరు!
కర్కాటక రాశి
ఈ రంగుల పండుగలో కర్కాటక రాశివారి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గందరగోళం తొలగిపోతుంది. ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. పనిపట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులను నమ్మవద్దు.
సింహ రాశి
కొన్ని పాత విషయాల గురించి మీ చింతలు పెరుగుతాయి..అయితే పిల్లల్ని చూసి సంతోషపడతారు. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లో గడపడమే మంచిది. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభపలితాలున్నాయి.
కన్యా రాశి
ఈ రోజు కన్యారాశివారికి మంచి రోజు అవుతుంది. మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది..చేసే పనిని సరైన మార్గంలో పూర్తిచేస్తారు. ఈ రాశి విద్యార్థలకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పెళ్లైన వారి జీవితంలో సంతోషం నిండిఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి విద్యా విషయాలలో ప్రయోజనం ఉంటుంది. వ్యాయామం చేసే అలవాటు మిమ్మల్ని ఫిట్‌గా , ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. సామాజిక బాధ్యతలు నెరవేరుతాయి. రోజువారీ పనులు ప్రయోజనకరంగా ఉంటాయి.
Also Read: మీ రాశి ప్రకారం హోలీ రోజు మీరు ఏ రంగు దుస్తులు వేసుకోవాలంటే!
వృశ్చిక రాశి
మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులలో స్నేహితుల సహకారం ఉంటుంది.జీవితంలో పురోగతి కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా భావిస్తారు. ఈ రాశి విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి, దీని కారణంగా మీరు కొంచెం ఇబ్బంది పడతారు కానీ అవసరమైన డబ్బు చేతికందుతుంది. కుటుంబంలోని చిన్నవారు మిమ్మల్ని సహాయం కోసం అడగవచ్చు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తెలివితేటలతో మీ పని పూర్తి చేసుకుంటారు. ఈ రోజు మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. ప్రయాణం చేయాల్సి వస్తే అవసరమైన మందులు మీ వెంట తీసుకెళ్లడం మంచిది..ప్రయాణంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. మీ మేధో సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
కుంభ రాశి
కొత్త వ్యక్తులను కలవడం వల్ల భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితులను కలుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక సేవ వైపు మొగ్గు చూపుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు మంచి రోజే కానీ తలపెట్టిన పనిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అన్యమనస్కంగా చేస్తే కొన్నిపనులు పూర్తికావు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి. ఇతరులపై ఆధారపడకుండా కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోండి.