అన్వేషించండి

Holi Horoscope in Telugu: మార్చి 25 రాశి ఫలాలు (25/03/2024) - హోలీ రోజు ఈ రాశులవారి లైఫ్ కలర్ ఫుల్!

Horoscope Prediction 25th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 25th 2024   

మేష రాశి

హోలీ రోజు మేషరాశి వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలలో కష్టనికి తగిన ఫలితం ఉంటుంది.  కుటుంబంలో సంతోషం ఉంటుంది.

వృషభ రాశి

ఈ రోజు మీకు.. దీర్ఘకాలంగా పెండింగ్ లో పనులు పూర్తవుతాయి . కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  కుటుంబ సభ్యులతో  విభేదాలు ఉండవచ్చు...గత తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగండి. హోలీ రోజున మీ జీవితంలో రంగులు నిండాలంటే మీ ఆలోచనల్లో కొత్తదనం ఉండాలి. 

Also Read: ఆనందాల రంగుల కేళి హోలీ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

మిథున రాశి

ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబానికి సమయం వెచ్చిస్తారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయవద్దు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు చాలా శుభదినం. వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి.  

Also Read: హోలీ రోజు నుంచి ఈ 4 రాశుల వారి జీవితంలో ఇంద్రధనస్సు వెల్లి విరుస్తుంది!

సింహ రాశి

ఈ రాశి వారు ఈరోజు ఏదో తెలియని భయం వల్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు వల్ల కొంత ప్రశాంతత ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయం కేటాయించండి.సవాలుతో కూడిన పనులను పూర్తి చేయడానికి సహోద్యోగుల సహాయం అడగండి. కోపం తగ్గించుకోవాలి.

కన్యా రాశి

ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ కలలన్నీ నిజమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి  బంగారు అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. 

Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!

తులా రాశి

ఈ రోజు మీకు అద్భుతమైన  రోజు అవుతుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు సాధ్యమే. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సమేతంగా హోలీలో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించండి. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  శత్రువుల నుంచి కొంచెం సురక్షితంగా ఉండండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులు , స్నేహితుల సహకారంతో నూతన ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు.   

Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి జీవితాల్లో అనేక అద్భుత మార్పులు వస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఈరోజు ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.  

మకర రాశి

మీ జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అజాగ్రత్తగా ఉండకండి. ఆస్తి సంబంధ వివాదాల కారణంగా ఈరోజు కొంత మందికి ఒత్తిడి పెరుగుతుంది.   కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి.

కుంభ రాశి 

ఆర్థిక విషయాలలో కుంభరాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది.  ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. కొంతమంది ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కెరీర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి.  

Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!

మీన రాశి

ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. గడువులోపు ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. బంధాల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

Note:  ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget