అన్వేషించండి

Guru Vakri 2025: నవంబర్ 11 నుంచి తిరోగమంలో బృహస్పతి! 12 రాశులపై ప్రభావం, పరిష్కారాలు తెలుసుకోండి

Guru Vakri 2025 date: నవంబర్ నెలలో దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో తిరోగమమనం చెందుతాడు. ఇది కొన్ని రాశులకు శుభప్రదం. పురోగతి, కొత్త అవకాశాలు లభిస్తాయి.

Jupiter  Retrograde 2025: జ్యోతిష్య శాస్త్రంలో గురువును శుభ,  గొప్ప గ్రహంగా భావిస్తారు. గురువు ఎప్పుడైనా రాశిని మార్చినప్పుడు లేదా తిరోగమనం చెందినప్పుడు ఈ ప్రభావం  అన్ని రాశులపై  ఉంటుంది. ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్  ఆఖర్లో మిథునం నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించాడు. నవంబర్ 11 రాత్రి కర్కాటకంలో తిరోగమనం చెందుతున్నాడు. డిసెంబర్ 05 వరకు కర్కాటక రాశిలో ఇదే స్థితిలో సంచరిస్తాడు.  

గురువు "అతిచారి గమనం" అంటే గ్రహం సాధారణ వేగం కంటే చాలా వేగంగా కదలడం. సాధారణంగా, గురువు ఒక రాశిలో 12-13 నెలల వరకు ఉంటాడు, కానీ అతిచారి అయినప్పుడు త్వరగా రాశిని మారుస్తాడు. ఈ గమనం ప్రత్యక్ష ప్రభావం కెరీర్, విద్య, వైవాహిక జీవితం, ధనం, అదృష్టంపై పడుతుంది. అతిచారి గురువు యొక్క ప్రభావాలు త్వరగా కనిపిస్తాయి.

2025 సంవత్సరంలో గురువు 3 సార్లు గమనాన్ని మార్చుకుంటాడు

2025 సంవత్సరంలో బృహస్పతి మూడు సార్లు గమనాన్ని మార్చుకుంటాడు-

మే 14, 2025 న అతిచారి గమనంతో మిథున రాశిలోకి ప్రవేశం,
నవంబర్ 11, 2025 న వక్రీ గమనంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం,
డిసెంబర్ 5, 2025 న వక్రీ స్థితిలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం.

ఈ సంవత్సరం గురువు గమనంలో ఈ తీవ్రమైన మార్పు అనేక రాశులకు అదృష్టం,  కొత్త అవకాశాలను తెస్తుంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, తుల, కుంభం , మీన రాశి వారికి ప్రయోజనకరమైన ఫలితాలున్నాయి

బృహస్పతి  ప్రాముఖ్యత

బృహస్పతిని దేవగురువు, జ్ఞానం ,  ధర్మ స్థాపకుడు అని పిలుస్తారు. ఇది కెరీర్, విద్య, సంతానం, ధనం, వైవాహిక జీవితం,  అదృష్టం కారక గ్రహం.
బృహస్పతి సాధారణంగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు , మీన లగ్నం వారికి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు.  వృషభం, మిథునం, కన్య, తుల, మకరం,  కుంభ లగ్నం వారికి ఇది తక్కువ ప్రభావవంతమైన గ్రహం.

ఏదైనా గ్రహం వక్రీ అవ్వడం అంటే దిశను మార్చుకుని వెనుకకు తిరగడం. ఇది ఆత్మపరిశీలన .. లోతుగా ఆలోచించే సమయం. గురువు వక్రీ అవ్వడం అంటే భావాలు   జీవిత దిశలో మార్పు వస్తుందని సూచిస్తుంది. 
 
గురువు తిరగోమనం సమయంలో ఆ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందంటే..
 
షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.
విద్య ,  సామాజిక సంస్కరణలకు సంబంధించిన పనుల్లో వేగం పెరుగుతుంది.
రాజకీయాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.
భారీ వర్షాలు, భూకంపాలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వంటి సహజ సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
ఆరోగ్య సంక్షోభాలు ,  ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగాలు , ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి.

గురువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకోండి 

ప్రతిరోజూ “ఓం భగవతే వాసుదేవాయ నమః” మంత్రాన్ని ఒక మాల జపించండి.

గురువారం నాడు పసుపు రంగు దుస్తులు, పప్పులు, పసుపు, శనగపిండి లడ్డూలను దానం చేయండి.

అరటి చెట్టుకు నీరు సమర్పించండి.

క్రమం తప్పకుండా రామ రక్షా స్తోత్రం, మృత్యుంజయ మంత్రం పఠించండి.

హనుమంతునికి తమలపాకులు సమర్పించండి.

విష్ణువును,  దుర్గాదేవిని ఆరాధించండి.

12 రాశులపై గురు వక్రీ ప్రభావం

మేష రాశి: మతపరమైన  శుభ కార్యాలలో ధనం ఖర్చు అవుతుంది. వివాహానికి బలమైన అవకాశాలు ఏర్పడతాయి.

వృషభ రాశి: ఆర్థిక లాభం ,వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు. కొత్త పథకాలతో లాభం ఉంటుంది.

మిథున రాశి: ఉద్యోగం ,పదోన్నతికి అవకాశాలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి: శుభ సమయం, పెద్దల అనుగ్రహంతో అదృష్టం కలిసొస్తుంది.

సింహ రాశి: విద్య , పరిశోధనలో విజయం, ఆదాయం - వ్యయం మధ్య సమతుల్యత ఉంటుంది.

కన్యా రాశి: వివాహం ,  కుటుంబ శుభ కార్యాలకు అవకాశాలు. వ్యాపారంలో అభివృద్ధి.

తులా రాశి: వ్యాధులు, అప్పులు , శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వృశ్చిక రాశి: సంతానం ,  స్నేహితుల సహకారం లభిస్తుంది. విజయానికి అవకాశాలు.

ధనుస్సు రాశి: ఇల్లు, వాహనాలకు సంబంధించిన పనుల్లో విజయం, సామాజిక గౌరవం పెరుగుతుంది.

మకర రాశి: అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. మతపరమైన కార్యకలాపాలలో ఆసక్తి.

కుంభ రాశి: ధన యోగం బలంగా ఉంటుంది, కొత్త ఆర్థిక పథకాలు రూపొందుతాయి.

మీన రాశి: గౌరవం  పెరుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Embed widget