అన్వేషించండి

Horoscope Today 07 November 2024: ఈ రాశులవారిపై దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం ఉంటుంది!

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 07, 2024

మేష రాశి

ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు. వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది.  సాంకేతిక రంగాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీరు ప్రజాదరణ పొందుతారు. పవిత్ర స్వభావం గల వ్యక్తులతో మీ పరిచయం మరింత బలపడుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

వృషభ రాశి

మీ తండ్రితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది...ఖర్చులను తగ్గించుకోవలసి ఉంటుంది. ఇంట్లో, కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా అనిపించవు. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. 

మిథున రాశి

ఈ రోజు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు అంతగా కలసిరాదు.  ఏదైనా పోగొట్టుకున్న వస్తువు కనిపిస్తుంది. యువతకు కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుతాయి. మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటలు భవిష్యత్ కోసం ప్లాన్స్ వేసుకుంటారు. 

Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!

కర్కాటక రాశి

ఈ రోజు మీకు సృజనాత్మక ఆలోచనలు  వస్తాయి. మీరు  స్టార్టప్‌ల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సహోద్యోగుల ప్రవర్తన వల్ల ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తారు. మీరు మీ లక్ష్యం వైపు దృష్టి సారిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది 

సింహ రాశి

మీ ప్రజాదరణ పెరుగుతుంది. ఈ రోజు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది.  మీరు మీ కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించడంలో విజయం సాధిస్తారు. వివాదాస్పద విషయాలలో సయోధ్య కుదరవచ్చు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. లావాదేవీలను జాగ్రత్తగా చేయండి.

కన్యా రాశి

ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆఫీసులో  మరింత శ్రమించాల్సి ఉంటుంది. పాత సమస్యల గురించి ఆందోళన చెందుతారు. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. ఇంటి పెద్దలు మీతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు.

తులా రాశి

ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పిల్లల అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి. పని ప్రదేశంలో ఈ రోజు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు.

Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!

వృశ్చిక రాశి

ఈ రోజు అధికారి తరగతికి చెందిన వ్యక్తులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులలో ఆలస్యం కావచ్చు. బ్యాంకు రుణాలకు సంబంధించి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. మీకు అనవసరమైన సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబంలో సమస్యలు పరిషష్కరిస్తారు.

ధనస్సు రాశి

వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. మీ మాటతీరుని నియంత్రణలో ఉంచండి. మిత్రులతో సాన్నిహిత్యం ఉంటుంది.  అనవసరమైన ఖర్చులను నియంత్రించడంలో మీరు విజయం సాధిస్తారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.  

మకర రాశి

ఈ రోజు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి అజాగ్రత్తగా ఉంటారు. మితిమీరిన ఉత్సాహం వల్ల పని చెడిపోయే అవకాశం ఉంది. పాత రోగాలు మళ్లీ రావొచ్చు. ప్రదర్శన కోసం డబ్బు ఖర్చు చేయవద్దు. విదేశీ వనరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు దగ్గరి బంధువు నుంచి శుభవార్త పొందవచ్చు 

Also Read:  కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

కుంభ రాశి

మీరు ఈరోజు ఇంట్లో వేడుకను నిర్వహించవచ్చు. మీ పూర్వీకుల వ్యాపారంలో మీరు పెద్ద లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు పొందే అవకాశం ఉంది.

మీన రాశి 

మీరు మీ అనుభవాలతో కష్టమైన పనులను పూర్తి చేయగలుగుతారు. న్యాయపరమైన చిక్కుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వామ్యానికి అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ గౌరవ భావం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే ఏమవుతుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
L And T Chairman: ఆదివారం సెలవు అవసరమా అన్న వ్యక్తే లీవ్‌ తీసుకోమంటున్నారు- ఎల్ అండ్ టి ఛైర్మన్ ప్రకటన చూశారా ?
ఆదివారం సెలవు అవసరమా అన్న వ్యక్తే లీవ్‌ తీసుకోమంటున్నారు- ఎల్ అండ్ టి ఛైర్మన్ ప్రకటన చూశారా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Embed widget