Karthika Masam Non - Veg: కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే ఏమవుతుంది!
Non - Veg Sales Decreased On Eve Of Karthika Masam: కార్తీకమాసం వచ్చింది..నాన్ వెజ్ రేట్లు పడిపోయాయ్ అంటున్నారు వ్యాపారులు. కార్తీకం వస్తే నాన్ వెజ్ ఎందుకు తినకూడదంటారు? తింటే ఏమవుతుంది?

Karthika Masam Non - Veg : పండుగలు, కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక రోజుల్లో నాన్ వెజ్ తినొద్దని చెబుతారు పండితులు, పెద్దలు. అయితే కార్తీకమాసం వచ్చిందంటే నెల రోజుల పాటూ నాన్ వెజ్ ముట్టుకోవద్దనేస్తారు. ఈ ఆచారాలు, సంప్రదాయాలు పెద్దల నుంచి వస్తున్నాయి మనం కూడా పాటించాలనే అనుకుంటారు కానీ చాలామందికి అవెందుకు అనుసరిస్తున్నామో తెలియదు. కార్తీకమాసంలో నాన్ వెజ్ తినకూడదు అంటే తినకూడదు.. తింటే భక్తిలేదని, ఇంకేదో జరిగిపోతుందని భావిస్తారు. దైవభక్తి లేనివారు ఇవేమీ పెద్దగా పట్టించుకోరు...ముక్కలేనిదే ముద్దదిగదంటూ లాగించేస్తారు. అయితే కార్తీకం నెల రోజులు నాన్ వెజ్ తినకపోవడం వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు..ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయంటున్నారు పెద్దలు..
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
ఆధ్యాత్మిక కారణాలు
నాన్ వెజ్ అంటే..ఓ ప్రాణిని చంపి తినడమే. ఓ జంతువుని చంపాలని అనుకునేవాడు, చంపమని చెప్పేవాడు, చంపేవాడు, మాంసం అమ్మేవాడు, కొనేవాడు, తీసుకెళ్లేవాడు, వండేవాడు, తినేవాడు..ఈ ఎనిమిది మందికి హింసాదోషం తప్పదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. ఇలా ఓ పాపంలో ఎంతమంది భాగం ఉంటుందో అంతమందికి పాపం చుట్టుకున్నట్టే... ఓ పుణ్యకార్యంలో భాగం అయ్యే అందరకీ పుణ్యంలో ఫలితం ఉంటుంది.
ఇంద్రియాణం నిరోధేన రాగ ద్వేష క్షయేణ చ
అహింసాయా చ భూతానా మమృతత్వాయ కల్పతే
ఇంద్రియ నిగ్రహం వల్ల, రాగద్వేషాలని వదిలేయడం వల్ల, సర్వ జీవాలపట్ల అహింసని అవలంబించడం వల్ల...అమృతంతో సమానమైన మోక్షం కలుగుతుంది
యో బంధన వధక్లేశాన్ ప్రాణీనాం న చికీర్షతి
స సర్వస్య హితప్రేప్సు: సుఖ మత్యంత మశ్నుతే
ఎవరైతే ప్రాణులని చంపడానికి గానీ, బంధించడానికి గానీ, వాటిని బాధ పెట్టడానికి గానీ ఇష్టపడరో..ఎవరైతే ప్రాణుల హితం కోరుతారో వాళ్లు అనంతమైన సుఖాలను అనుభవిస్తారు.
అనుమాన్తా విశసితా నిహన్తా క్రయవిక్రయా
సంస్కర్తా చోపహర్తాచ ఖాదకశ్చేతి ఘాతకాః
మాంసం తిన్నవాడు, పెట్టిన వాడు, వండిన వాడు, అమ్మిన వాడు, ప్రాణికి చంపిన వాడు, అవయవములు ముక్కలుగా చేసినవాడు, దానికి అనుమతినిచ్చినవాడు ...అందరూ ఆ జీవిని చంపినవాళ్లే అవుతారు
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
యో ఆ హింసకాని భూతాని హినస్త్యా త్మ సుఖేచ్ఛయా
సజీవంశ్చ మృత శ్చైవ న క్వచి త్సుఖమేధతే
హింస కలిగించని ప్రాణులు...అవి జంతువులైనా , మనుషులైనా...తమ సంతోషం కోసం వాటిని హింసించేవాళ్లు బతికి ఉన్నా చనిపోయినవారికిందే లెక్క. అలాంటివాళ్లకి ఇహలోకం, పరలోకంలో సుఖ సంతోషాలు ఉండవు. అయితే ఆత్మరక్షణ కోసం ఆయుధం వినియోగించడంలో తప్పులేదు.
అహింసయేంద్రియా సంగై ర్వైదికైశ్చైవ కర్మభిః
తప్సశ్చరణై శ్చోగ్రై: సాధయనన్తీ హ తత్పదమ్
సర్వ ధర్మాల్లో సత్యం అహింసలదే ప్రధమస్థానం. మరి మనకు తెలియకుండా ఎన్నో ప్రాణులు కాళ్లకింద నలిగిపోతున్నాయ్, తెలియకుండా హింసకు పాల్పడుతున్నా, ఆకుకూరల్లో ప్రాణం లేదా అంటే.. హింసకు పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యంకాని పని..అందుకే ఎంత తక్కువ హింసకు పాల్పడితే అంత మంచిది అని అర్థం.
కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేయడం వల్ల ఆరోగ్య రహస్యాలు
వర్షాకాలం పూర్తై చలికాలం ప్రారంభమయ్యే సమయంలో ఎన్నో ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేస్తాయి. మనుషులు శరీరంలోనే కాదు జంతువుల శరీరంలోనూ ఈ మార్పులుంటాయి. అలాంటి జంతువులుల మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. వాతావరణం మందంగా ఉడే ఈ సమయంలో తేలికపాటి ఆహారం మాత్రమే జీర్ణం అవుతుంది. సరిగా జీర్ణం కానీ, మసాలాలు వినియోగించిన నాన్ వెజ్ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు..జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్తీకమాసం నెలరోజులు శాఖాహారం మితంగా తీసుకోవాలని చెబుతారు.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

