Today Horoscope in Telugu: ఆగస్టు 21 సోమవారం రాశి ఫలితాలు, వీరు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి!
Rasi Phalalu in Telugu:మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 21st
మేష రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ కి ఉపయోగపడే ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. మీరు ప్రారంభంచబోయే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఏ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద లావాదేవీలు ఈ రోజు చేయకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి అంత అశాజనకంగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండాలి..మాటల విషయంలో సంయమనం పాటించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు దూరప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. కుటుంబంతో మంచి బంధం కొనసాగేలా చూడండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆనందం, వారికి ఆదాయం - ఆగష్టు 21 to 27 వారఫలాలు
సింహ రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మతపరమైన ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇంట్లో ఉన్న అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆర్థికి స్థితి బావుంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలొస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కోర్టు వ్యవాహారాలు అనుకూలంగా ఉంటాయి
కన్యా రాశి
ఈ రోజు మీకు తెలిసిన వారి ప్రవర్తనతో మీ మనస్సు కలత చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అన్నపానీయాలపై శ్రద్ధ వహించండి. పనిచేసే ప్రదేశంలో పెద్దగా మార్పులు ఆశించవద్దు. కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబంలో ప్రియమైనవారితో విభేదాలుంటాయి.
తులా రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక పనుల పూర్తిచేయాల్సిన అవసరం వస్తుంది. కొత్తగా ఏ పనులు ప్రారంభించవద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.
వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో శుభకార్యం నిర్వహించే ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త పని ప్రణాళికలు అమలు చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశి నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరాశ తప్పదు. ఉద్యోగులు, వ్యాపారులకు ఈరోజు అంత అనుకూల పరిస్థితులు లేవు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మనస్సు చంచంలంగా ఉంటుంది. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: కుక్క ఏడిస్తే అపశకునమా , ఎవరికో మూడినట్టేనా -ఇందులో నిజమెంత!
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు దూర ప్రయాణం చేయాల్సి వస్తే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఎవ్వరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వొద్దు. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.
మీన రాశి
ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగులు నూతన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేయడంలో సక్సెస్ అవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.