Daily Horoscope 6th November: నవంబర్ 6 రాశిఫలాలు: ఈరోజు ఈ రాశులవారికి ధన లాభం
ఈరోజు కొన్ని రాశుల వారికి ధనలాభ సూచనలుంటే, మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంకా వివిధ రాశుల వారి గ్రహస్థితి ఈరోజు ఎలా ఉందో చూద్దాం.
మేషరాశి
మేషరాశివారికి ఈరోజు అంత ఆశాజనకంగా లేదు. సన్నిహితుల నుంచి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. పనిచేసే చోట చికాకులు తప్పవు. చేపట్టిన పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది.
వృషభ రాశి
వీరికి సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. రాజకీయ రంగాల వారికి అనుకూలం.
మిథున రాశి
కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వినోదాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన డబ్బు చేతికందుతుంది. వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది.
కర్కాటక రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోడం ఈ రాశివారికి చెప్పదగిన సూచన. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దైవదర్శనాలు చేస్తారు. ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉన్నాయి. ముఖ్యమైన పని ఉంటే వాయిదా వేయడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్థులకు మామూలుగా రోజు గడుస్తుంది. దూరప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య రాశి
వీరికి ఈరోజు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఇంటా, బయట ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది.
తుల రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంది. రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థులకు అనుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభ సూచనలున్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వృశ్చిక రాశి
వీరికి ఆశించినంత ఆశాజనకంగా ఈరోజు ఉండకపోవచ్చు. పనులన్నీ చాలా నెమ్మదిగా నడుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. పనిచేసే చోట ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు.
ధనస్సు రాశి
కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. పనులన్నీ మందకొండిగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. ఎక్కువ శ్రమతో పనులను పూర్తి చేయగలుగుతారు. బంధు, మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.
మకర రాశి
బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రయత్నం చేత ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణబాధలు కలుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. అనారోగ్య కలిగే అవకాశాలున్నాయి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. ఉద్యోగస్తులకు అంత అనుకూలం కాదు.
మీన రాశి
మీనరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో ఆశాజనక ఫలితాలుంటాయి.
Also Read: కార్తీకమాసంలో ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎలాంటి వత్తులు ఉపయోగించాలి?