అన్వేషించండి

Dhurandhar: వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'ధురంధర్'! రణవీర్ సింగ్ సక్సెస్ సీక్రెట్ వెనుక సంఖ్యాశాస్త్రం!

Ranveer Singh Numarology: రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇదంతా న్యూమరాలజీ మ్యాజిక్కా? సంఖ్యా శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు?

Dhurandhar worldwide box office collection: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా సంఖ్యాశాస్త్రం వల్ల కలిసొచ్చిన అదృష్టం అంటున్నారు నిపుణులు. న్యూమరాలజీ ప్రకారం రణవీర్ సింగ్ నంబర్ 6. ఈ నంబర్ కి అధిపతి శుక్రుడు. ఇది కళలు, సౌందర్యం, వినోదం, ఆకర్షణకు ప్రాతినిథ్యం వహించే గ్రహం. అందుకే రణవీర్ కెరీర్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హీరోగా నటించినా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినా ఆ నటనకు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. రీసెంట్ గా దురంధర్ మూవీతో మరో సక్సెస్ అందుకున్నాడు రణ వీర్ సింగ్. సంఖ్యాశాస్త్రం ప్రకారం తన నంబర్ 6 అవడం కూడా సక్సెస్ కి చేరువ చేసిందన్నది జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట.

శుక్రుడు  ప్రత్యేక గుర్తింపును ఇస్తాడు

శుక్రుడు కళ , ప్రదర్శన వంటి రంగాలలో ఉన్న వ్యక్తులకు ప్రత్యేకమైన సృజనాత్మకతను ఇస్తాడు. రణవీర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ రణవీర్ ను ప్రత్యేకంగా చూపినవే. విభిన్నమైన పాత్రల ఎంచుకోవడమే కాదు అందులో ఒదిగిపోయి నటిస్తాడనే ప్రశంసలు అందుకున్నాడు. దురంధర్ కూడా అలాంటి మూవీగానే నిలిచింది. ఈ సినిమాలో రణవీర్ లుక్ , నటన చాలా కొత్తగా ఉంటుంది. 

న్యూమరాలజీ ప్రకారం రణవీర్ నంబర్ 6
 
సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 ఉన్నవారు కళకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగంగా కనెక్ట్ అయిపోతారు. గత చిత్రాలు మాత్రమే కాదు ధురంధర్ సినిమాలోనూ రణవీర్ నటన చూస్తే ఇది స్పష్టమవుతుంది . శుక్రుని ప్రభావం తనని ఆకర్షణీయంగా మార్చడమే కాదు ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యాన్నిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఇదే నంబర్ కి చెందిన నటులు ఇంకా...షారుఖ్ ఖాన్ (6), ఐశ్వర్య రాయ్ (6), మాధురి దీక్షిత్ (6), కరీనా కపూర్ (6)..ఇంకా లిస్ట్ పెద్దగానే ఉంది. వీరంతా కళారంగంలో రాణించినవారే

ధురంధర్ సక్సెస్ రణవీర్ కెరీర్లో మైలురాయి
 
ధురంధర్‌ సినిమా రణవీర్ కెరీర్లో మైలురాయి అవుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర, సంఖ్యాశాస్త్ర నిపుణులు. నంబర్ 6 + మాస్టర్ 33 వైబ్రేషన్ + ప్రసన్న శుక్రుడు + పీక్ ఏజ్ – ఇవన్నీ కలిస్తే ఇది కేవలం హిట్ కాదు, ఒక హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ + ఆస్కార్ లెవెల్ పర్‌ఫార్మెన్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. రణవీర్ సింగ్ ఇప్పటివరకు చేసిన  సినిమాల కన్నా ఎక్కువ గుర్తింపు, డబ్బు, ఫేమ్ ఇవన్నీ ధురంధర్ అందిస్తుందని  న్యూమరాలజీ చాలా క్లియర్‌గా చెబుతోంది.  ఈ నంబర్ 6 వల్లే అద్భుతంగా రాణిస్తున్నాడని..భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకుంటాడని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు

 2025 డిసెంబర్ 5న విడుదలైన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్  ధురంధర్ (Dhurandhar). రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో భారత ఇంటెలిజెన్స్ ఏజెంట్‌ల రియల్-లైఫ్ ఆపరేషన్స్ ఆధారంగా తెరకెక్కింది. మూవీ రన్ టైమ్ 3 గంటల 34 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు దాన్ని గ్రిప్పింగ్‌గా ప్రశంసించారు. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల నెట్ మార్క్‌ను దాటింది మూవీ. ప్రపంచవ్యాప్తంగా  160 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో రణవీర్ నటన చూసి..పైనల్లీ హి ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఆయా  ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
దేవశయని ఏకాదశి: తులసి దీపం ఈ దిశలో వెలిగిస్తే అదృష్టం మీ సొంతం!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
తొలి ఏకాదశి 25-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget