అన్వేషించండి
Advertisement
Capricorn Horoscope 2023: కొత్తఏడాది ఈ రాశివారి జీవితంలో పెనుమార్పులు తీసుకు రాబోతోంది, 2023 మకర రాశి వార్షిక ఫలితాలు
Makara Raasi horoscope 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Capricorn Horoscope 2023: 2023 ప్రారంభంలో శని తన సొంత రాశి అయిన మకరంలోనే ఉంటుంది..ఫిబ్రవరి 9 నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి అక్టోబరు వరకూ రాహువు మేషరాశిలో ఉంటాడు. కానీ ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకూ గురువు-రాహువు కలసి ఉన్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్థికం, ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, వ్యాపారం పరంగా మకర రాశివారికి 2023 ఎలా ఉందో చూద్దాం...
- 2023లో మకర రాశివారి వృత్తి ఉద్యోగాల్లో చాలా మార్పులుంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేతువు 10 వస్థానంలో సంచరించడం వల్ల మీ దృష్టిని పనినుంచి మరలుస్తాడు...కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది...ఆ సమయంలో సంయమనం పాటించడం, సర్దుకుపోవడం చేయడమే మంచిది మే, నవంబరులో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి..ఓవరాల్ గా 2023 మకరరాశి వారి కెరీర్లో ఎత్తుపల్లాలు తప్పవు.
- 2023 మకరరాశివారికి ఆర్థికంగా బావుంటుంది. అయితే డబ్బును హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు-బుధుడు కలసి సంచరిస్తున్నందున మీ ఆర్థిక సమతుల్యతను కాపాడుకోగలగుతారు. అక్టోబరు తర్వాత రాహువు,కేతువు ..నాల్గవ, దశమ స్థానాల్లో ఉండడం వల్ల ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం తప్పదు. పనిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వ్యసనాలకు లోనుకాకండి...
- కొత్తఏడాదిలో మీ వైవాహిక జీవితం బావుంటుంది. 2023 మీ జీవితంలో చాలా సంతోషకరమైన సంవత్సరం అవుతుంది.
- ఆరోగ్య పరంగా...చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బందులుండవు. నిర్వక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆహారంలో నియంత్రణ, వ్యాయామం, యోగాపై దృష్టిసారించండి
- మకరరాశివారు ఈ ఏడాది ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఉంది. మీ ప్రియమైనవారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేరు.
Also Read: ఈ ఏడాది ఆఖరు ఈ రాశులవారికి సంతోషాన్నిస్తుంది, డిసెంబరు 30 రాశిఫలాలు
2023 మకరరాశివారి మాస ఫలితాలు
- జనవరి నెలలో మకర రాశి వారి జీవితంలో పెను మార్పులుంటాయి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బావుంటుంది, ఆదాయం పెరుగుతుంది
- ఫిబ్రవరిలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యతగా ఉంటారు.
- మార్చి నెలలో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. గృహ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తల్లి దండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
- ఏప్రిల్ నెలలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
- మేలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు సానుకూలంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం.
- జూన్ నెలలో కొత్త భాగస్వాములతో కలసి వ్యాపారం చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికల నెరవేరుతుంది
- జూలై నెలలో ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలి.
- ఆగస్ట్ , సెప్టెంబరులో అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్తగా ఉండాలి
- అక్టోబర్ నెల మీరు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది
- నవంబరు, డిసెంబర్ నెలల్లో జీవితంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. ప్రేమలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి.
Also Read: 7 నెలలు రకరకాల ఇబ్బందులు, 5 నెలలు ఆర్థిక ప్రయోజనాలు, 2023లో ధనస్సు రాశి వార్షిక ఫలితాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రికెట్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion