సెప్టెంబరు 11 రాశిఫలాలు - ఈ రాశుల ఉద్యోగులకు గుడ్ టైమ్ నడుస్తోంది!
Horoscope Prediction 11 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 11 September 2024
మేష రాశి
ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణం ఫలితాలున్నాయి. మీరు రెగ్యులర్ గా చేసే పనిలో ఎలాంటి మార్పులు అవసరం లేదు. ఆకస్మిక అతిథులను రిసీవ్ చేసుకోవాల్సి రావొచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత వివాదాలు పరిష్కారానికి అనుకూలమైన సమయం ఇది. వ్యాపారంలో ఊహించని విధంగా పురోగతి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధస్తారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు..మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధైర్యంతో కష్టమైన పనులను కూడా సకాలంలో పూర్తిచేస్తారు.
Also Read: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!
కర్కాటక రాశి
ఈ రాశి వ్యాపారులు నగదుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులుంటాయి.
సింహ రాశి
కెరీర్లో పురోగతి ఉండే సమయం ఇది. రాజకీయ నాయకులతో సంబంధాలు కలిసొస్తాయి..పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ద వహించాలి.
కన్యా రాశి
విదేశాలలో వ్యాపారం చేసేవారికి లాభాలొచ్చే సమయం ఇది. ఇంట్లో శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. నూతన స్నేహితులు ఏర్పడతారు. ఏ పనిని అసంపూర్తిగా ఉంచొద్దు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!
తులా రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రేమ సంబంధాలలో అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. పాత ఆస్తులు విక్రయించడం వల్ల లాభపడతారు. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వద్దు. నూతన పెట్టుబడులు పెట్టేముంది అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నూతన ప్రాజెక్టుల విషయంలో అనవసర ఒత్తిడి తీసుకోవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులకు వాదనలకుదిగొద్దు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కాస్త సంయమనం పాటించాలి.
Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
మకర రాశి
అనుకోని ఖర్చులు పెరుగుతాయి..సమయానికి డబ్బుచేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసేవారు లాభపడతారు. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చూసుకోండి. కుటుంబ పెద్దల సలహాలు స్వీకరించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
కెరీర్‌లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్యలు ఈ రోజు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొత్తగా ప్రారంభించిన పనుల్లో సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించిన తర్వాత మనసంతా సంతోషంగా ఉంటుంది.
మీన రాశి
ఈ రాశి ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో పెద్దల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకేసారి ఎక్కువ పనులపై దృష్టి పెట్టొద్దు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలతో బిజీగా ఉంటారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.