August Born People: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!
Astrology: మీరు జన్మించిన టైమ్ లో గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు..మీరు పుట్టిన నెల కూడా మీ లక్షణాలేంటో చెప్పేస్తుంది అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఆగష్టులో జన్మించినవారి లక్షణాలేంటో తెలుసా
August Born People: ఆగస్టులో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. ధైర్యం, ఆత్మవిశ్వాసం, వినయం, విధేయతలో వీళ్లకు వీళ్లే సాటి...అత్యత్భుతమైన క్వాలిటీస్ ఉన్న వీరు ఓ విషయంలో దురదృష్ట వంతులు అనే చెప్పాలి...
ఆగస్టులో జన్మించిన వారి లక్షణాలివే...
మీ దూకుడికి సరిలేరెవ్వరు!
ఈనెలలో జన్మించిన వారు ప్రారంభించిన పనిని ఎంత కష్టం ఎదురైనా మధ్యలో విడిచిపెట్టరు..ఎలాగైనా పూర్తిచేసి తీరుతారు. ఇతరులపై పోటా పోటీగా గెలవడం వీరికి ఓ వ్యసనం అయిపోతుంది. ఇంటా బయటా మంచి గౌరవాన్ని పొందుతారు. అనుకున్న పనిని అనుకున్న క్షణమే ప్రారంభించేస్తారు. లేడికి లేచిందే పరుగు అనే సామెత వినే ఉంటారుగా... వీళ్లు ఈ రకమే. ఒక్కోసారి వీరి దూకుడు, ధైర్య సాహసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
కలల్లో మునిగితేలుతారు
ఈ నెలలో పుట్టినవారికి కలకు కనే స్వభావం ఉంటుంది. నిత్యం ఊహల్లో తేలిపోతుంటారు. ఇదే లక్షణం కొన్నిసార్లు అందలం ఎక్కిస్తే...మరికొన్నిసార్లు వీళ్లని సోమరులుగా మార్చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో రిలాక్స్ గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ...అవసరం వచ్చినప్పుడు ఢీ అంటే ఢీ అని బరిలోకి దిగిపోతారు... అప్పటివరకూ చూసిన వాళ్లేనా వీళ్లు అనిపిస్తారు...
దైవభక్తి ఎక్కువే
ఆగష్టులో పుట్టినవారికి ధైవ భక్తి అధికం. భగవంతుడిని విశ్వసిస్తారు. జ్ఞాపకశక్తి, లోకజ్ఞానం కూడా ఎక్కువే. ఆధ్యాత్మిక విషయాలపై, పురాణాలపై ఆసక్తి, అవగాహన ఉంటుంది.
ప్రేమైక జీవులు
ఈ నెలలో జన్మించినవారు ప్రేమిస్తారు..ప్రేమను అందుకుంటారు. మంచి జీవితాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరి ప్రేమ చాలా లోతుగా ఉంటుంది. జీవిత భాగస్వామిపై మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరిపై ప్రేమను కురిపిస్తారు. వృత్తి, ఉద్యోగాలపట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు..స్నేహితులు, సన్నిహితులు ఎక్కువే వీరికి.
Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!
ఒంటరితనం నచ్చదు
ఆగష్టు లో పుట్టినవారు ఎప్పుడూ అందరి మధ్యా సందడిగా ఉండాలనుకుంటారు. వీరికి ఒంటరి తనం అస్సలు నచ్చదు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అందరితోనూ చెప్పేయరు..కేవలం తమకు అత్యంత సన్నిహితులు అయినవారితో పంచుకుంటారు...వెంటనే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు.
ఈ విషయంలో దురదృష్ట వంతులు
ఆగష్టులో జన్మించిన వారు అన్నివిషయాల్లో అదృష్టవంతులే అయినప్పటికీ డబ్బు విషయంలో మాత్రం దురదృష్టవంతులనే చెప్పాలి. ఎంత సంపాదించినా కానీ సమయానికి వీరి చేతిలో డబ్బు అందుబాటులో ఉండదు. అలా అని పేదవారిగా ఉండిపోతారు అనుకుంటే పొరపాటే.. భారీగా సంపాదిస్తారు... అత్యవసరం అయిన సమయంలో కాస్త ఇబ్బంది పడతారు. నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి.
ఆగస్టులో జన్మించినవారికి సోమవారం, బుధవారం, ఆదివారం బాగా కలిసొస్తాయి. ఆకుపచ్చ, కాషాయ రంగు అదృష్టాన్నిస్తాయి. ఈ నెలలో జన్మించిన వారికి ఎక్కువగా కంటికి, గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.
Also Read: ఏదైనా పనిపై ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది!
గమనిక: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి