Weekly Horoscope in Telugu: మోహిని ఏకాదశి నుంచి బహుళ విదియ (మే 19 నుంచి మే 25 ) వరకూ వార ఫలం!
Weekly Horoscope 19-25 May 2024: మే 19 నుంచి మే 25 వరకూ ఈ వారం చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు 12 రాశులవారికీ అనుకూల ఫలితాలే ఉన్నాయి...మీ రాశి వారఫలితం ఇక్కడ తెలుసుకోండి....
Aries to Pisces Weekly Horoscope in Telugu: మే 19 నుంచి మే 25 వరకూ మీ వార ఫలితాలు...
మేష రాశి
మేషరాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిచయాలు మెరుగుపడతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు ధైర్యంగా అడుగేయాల్సిన సమయం ఇది. ప్రస్తుతం పరిస్థితులు మీకు అనుకూలం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. హనుమాన్ ఆరాధన మీకు శభాలు కలిగిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ వారం అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఎవరికైనా వాగ్ధానాలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారవేత్తలు పెద్ద ఒప్పందం చేసుకునే ముందు సరైన పరిశోధన చేయాలి. మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
మిథున రాశి
ఈ వారం మీ కుటుంబంలో సామరస్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులను కలుసుకోవడం వల్ల ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగులకు ఈ వారం మంచిది. హనుమంతుడికి ఆవనూనెతో దీపం వెలిగించండి
కర్కాటక రాశి
ఈ వారం మీకు కొంత గందరగోళంగా ఉండవచ్చు. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహా తీసుకున్న తర్వాత కొత్త పనులు చేపట్టండి. వ్యాపారంపై దృష్టి సారించాలి. మాట్లాడేటప్పుడు ఓసారి ఆలోచించండి. రుణప్రయత్నాలు ఈవారం పూర్తవుతాయి. ఈ వారం మీరు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అష్టాక్షరి మంత్రాన్ని జపించండి.
సింహ రాశి
సింహరాశివారికి ఈ వారం ప్రేమ ప్రతిపాదనలు రావొచ్చు. అనుకున్న ప్రతిపనిలోనూ శుభఫలితాలు పొందుతారు. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి
కన్యారాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ వారం కొన్ని శుభవార్తలు - కొన్ని అశుభవార్తలు వినాల్సి రావొచ్చు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులను నియంత్రించాల్సిన సమయం ఇది. పని ఒత్తిడి పెరుగుతుంది. హనుమంతుడిని దర్శించుకోండి.
తులా రాశి
ఈ వారం తులారాశి వారికి చాలా బాగుంటుంది. మీ సమయాన్ని ప్రయాణాలు, విందులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం మానుకోండి . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వారం మీరు విష్ణు సహస్రనామం పఠించండి
వృశ్చిక రాశి
ఈ వారం మీరు గందరగోళంలో ఉంటారు. ఒకేసారి ఉద్యోగ ఆఫర్‌లను పొందే అవకాశం ఉంది..మీ మనసుని ఏకాగ్రతతో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సలహాలు స్వీకరించండి కానీ తుది నిర్ణయం మీరే తీసుకోవాలి. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పరిస్థితులు మెరుగుపడతాయి. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి
ఈ రాశివారు ఈ వారం బిజీగా ఉంటారు. బంధువులను, కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మీ ప్రసంగాన్ని మితంగా ఉంచండి. కొత్త పనులు ప్రారంభించేముందు అందరి సలహాలు స్వీకరించండి. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు మంచిది. వస్తుపరమైన సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పసుపురంగు స్వీట్లు, పండ్లు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టండి.
మకర రాశి
చాలాకాలం తర్వాత మకర రాశివారికి ఈ వారం కాస్త తీరిక దొరుకుతుంది. ఒకే సమయంలో అన్ని పనులకు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. వ్యక్తిగత-వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత ఏర్పాటుచేసుకోవాలి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పనులు ఈ వారం పూర్తవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రేమికుల మధ్య పరస్పర వివాదాలు ఉండవచ్చు. ప్రేమికులు పెళ్లిదిశగా ఆలోచించవచ్చు. ఆర్థిక విషయాలు కలిసొస్తాయి. విష్ణు సహస్రం పఠించండి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కలిసొస్తుంది. గతవారం ఉండే ఆర్థిక ఇబ్బందులు ఈ వారం పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలకు ఈ వారం చాలా మంచిది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా విస్తరించాలి అనుకున్నా ఇది మంచి సమయం. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో విభేదాలు ఉండొచ్చు...కాస్త ఓపికగా వ్యవహరించాలి.
మీన రాశి
ఈ వారం మీకు చాలా అనుకూల ఫలితాలున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయాల్లో నిరాశ చెందేకన్నా ధైర్యంగా అడుగువేస్తే సక్సెస్ అవుతారు. ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించండి.