Astrology :ఈ రాశులవారికి పెళ్లయ్యాక కష్టాలు - సవాళ్లు తప్పవు!
Zodiac signs: పెళ్లి తర్వాత జీవితంపై ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. కొందరికి నెరవేరుతాయి..మరికొందరకి సమస్యగా మారుతాయి. ముఖ్యంగా ఈ రాశులవారికి పెళ్లి తర్వాత ఇబ్బందులు తప్పవంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు
Zodiac Signs: సక్సెస్ ఫుల్ లైఫ్ అనే మాట చెప్పడం చాలా ఈజీ కానీ..అలాంటి లైఫ్ దొరకడం అంతసులువేం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి కీలకమలుపు. ఎన్నో ఆశలతో కొత్తజీవితం ప్రారంభిస్తారు. కానీ ఆ ఆశలు, కలలు నెరవేరే అదృష్టం అందరకీ ఉండదు. పైగా కొందరికి వివాహం పైనే మంచి అభిప్రాయం ఉండదు..కానీ..కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ బంధంలోకి బలవంతంగా అయినా అడుగుపెట్టాల్సి రావొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా సాగిపోవాలని భావిస్తారు..అందుకే కొన్న సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మిథున రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశివారు వివాహం బంధంలో ఇమడటం కొంచెం కష్టమే కానీ ఆనందంగా ఉండేందుకు చేయాల్సని ప్రయత్నాలన్నీ చేస్తారంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!
మిథున రాశి
మిథున రాశివారు డైనమిక్ గా ఉంటారు. వీరి ఆలోచనలకు పదునెక్కువ. వ్యక్తిత్వానికి రెండు వైపులా ఉంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ఇష్టపడతారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. జీవితం విషయంలో స్పష్టత ఉంటుంది కానీ వీరి జీవితం అంత సజావుగా సాగదు. వీరిలో ఉండే విభిన్నత ఓ వ్యక్తికి పూర్తిగా కట్టుబడి ఉండడాన్ని సమర్థించదు. సంతోషకరమైన వివాహ జీవితం ఆశిస్తారు కాదు అది అంత ఈజీ కాదు. బంధం బలంగా ఉండాలంటే మనసులో మాటని బహిరంగంగా మాట్లాడాలి..కలసి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నించాలి.
Also Read: ఈ రాశులవారి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది!
సింహ రాశి
సింహరాశివారిది డామినేటింగ్ నేచర్. వీళ్ల చుట్టూనే అన్నీ జరగాలన్నది వీరి భావన. ఇది కొంతవరకూ మంచిదే కానీ కలకాలం కలసి ఉండాల్సిన బంధం విషయంలో ఇలా ఉంటే వారి జీవితం అంత సంతోషంగా సాగదు. మనసులో ప్రతిమాటను పంచుకునేందుకు ప్రయత్నించాలి... ప్రశంసలు అందించాలి...జీవిత భాగస్వామి అవసరాలను తెలుసుకుంటూ వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నించాలి.
వృశ్చికరాశి
ఈ రాశివారు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు...ఇదే తీరు వివాహంలో సమస్యలు తలెత్తేలా చేస్తుంది. అంత తొందరగా భాగస్వామిని విశ్వశించరు. అందుకే వృశ్చిక రాశివారు వివాహంలో ఫెయిలవుతారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే ముందు తాము నిజాయితీగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో కూర్చుని సమస్యలపై చర్చించడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు కానీ వాటిని కొనసాగించడంపై ఆసక్తి చూపరు.
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
ధనుస్సు రాశి
ధనస్సు రాశివారు స్వేచ్ఛా జీవులుగా ఉండాలి అనుకుంటారు. తమతో ఉండేవారికి సంతోషంగా ఉంచాలని భావిస్తారు. ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి వైవాహిక జీవితం ఎందుకు సంతోషంగా ఉండదు అనే ఆలోచన రావొచ్చు...అది పూర్తిగా వీరికి వచ్చే జీవిత భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది. ధనస్సు రాశి మనస్తత్వం అర్థం చేసుకుంటే అత్యంత సంతోకరంగా ఉంటుంది. లేదంటే కొన్ని సవాళ్లు తప్పవు. అయితే పంతాలకు పోకుండా భాగస్వామి భావాలను అర్థం చేసుకుని సాగిపోవడం ద్వారా కొంత ప్రశాంతత లభిస్తుంది.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.