Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!
Zodiac Pairs: వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా ...మన్మథుడు సినిమాలో ఈ సాంగ్ గుర్తుంది కదా.. ఈ రెండు రాశులవారు పెళ్లి చేసుకుంటే అలానే ఉంటుంది మరి
![Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే! Incompatible zodiac signs These zodiac sign pairs like Tom and Jerry or Which two zodiac signs should not marry Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/d0f21fda1d8c4e998ee1626da590fc571715187048814217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Which two Zodiac Signs Should Not Marry: పెళ్లిపై ఉన్నన్ని జోక్స్ మరే విషయంపైనా ఉండవేమో. అన్నీ సరిగ్గా సెట్టైతే అంతకు మించి సంతోషకర జీవితం ఉండదు..ఏ చిన్న తేడా వచ్చినా అంతకు మించి నరకం ఉండదు. కలసి ఉండలేరు , విడివిడిగా ఉండలేరు..మొత్తానికి టామ్ అండ్ జెర్రీలా నిత్యం కొట్టుకుంటూ ఈ జీవితం ఇంతే అని సాగిపోతారంతే. ఇదంతా మీ రాశులపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వారికి పొత్తు కుదరనట్టే కొన్ని రాశుల మధ్య కూడా సమన్వయం సరిగా ఉండదట. ఆ రెండు రాశులవారు పెళ్లి చేసుకుంటే మాత్రం ఇల్లు నిత్య కురుక్షేత్రమే అంటారు..ఇంతకీ టామ్ అండ్ జెర్రీ రాశులేంటి? అందులో మీ జంట ఉందా?
మేష రాశి - వృషభ రాశి
ఈ రెండు రాశులవారి ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మేష రాశి అగ్నికి సంకేతం అయితే వృషభ రాశి భూమికి సంకేతం. మేష రాశి వారు ఏదైనా నిమిషాల్లో నిర్ణయాలు తీసేసుకుంటారు, భగ్గుమని మండి ఆగిపోతారు. వృషభరాశి వారు మాత్రం స్థిరంగా ఉండేందుకే ఇష్టపడతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఈ రెండు రాశులవారికి మ్యాచ్ అవదు..
Also Read: ఈ రాశులవారి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది!
కర్కాటక రాశి - కుంభ రాశి
కర్కాటర రాశి - కుంభ రాశికి చెందిన వారు జంటగా మారితే వాదనలతో ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది. కర్కాటక రాశి నీటికి సంకేతం , కుంభ రాశి గాలికి సంకేతం. అందుకు తగ్గట్టే కర్కాటక రాశివారు ఎందులో అయినా తొందరగా ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తే... కుంభ రాశివారు సంపూర్ణ స్వతంత్రులుగా ఉండాలని భావిస్తారు. అందుకే ఈ రెండు రాశులవారికి అస్సలు సెట్టవదు.
వృషభ రాశి- ధనుస్సు రాశి
వృషభ రాశి భూమికి - ధనస్సు రాశి అగ్నికి సంకేతం. వృషభ రాశివారు ఇంట్లోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడితే ధనస్సు రాశివారు చక్కర్లు కొట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఈ రెండు రాశులవారు కనెక్ట్ అవడం చాలా అరుదు.
Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనేవాళ్లంతా ఇది తెలుసుకోండి!
సింహ రాశి-కన్యా రాశి
ఈ రెండు రాశులవారు సై అంటే సై అన్నట్టు ఉంటారు. పోటాపోటీగా భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. సింహ రాశి అగ్నికి..కన్యారాశి భూమికి సంకేతం. ఈ రెండు రాశులకు చెందినవారు పెళ్లిచేసుకుంటే ఇల్లు నిత్య కురుక్షేత్రమే..
వృశ్చిక రాశి - మేష రాశి
మేషం అగ్నికి సంబంధించిన రాశి అయితే వృశ్చికం నీటి సంబంధిత రాశి. ఈ రెండు రాశుల వారు వివాహం చేసుకుంటే ఆరంభంలో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఇద్దరికీ చుక్కలే. ఒకర్నొకరు డామినేట్ చేసుకోవాలి ప్రయత్నిస్తారు..ఎవరి నియంత్రణలో ఎవరూ ఉండేందుకు ఇష్టపడరు..ఫలితంగా సమస్యలు మొదలవుతాయి..
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
మకర రాశి-ధనుస్సు రాశి
ధనస్సు అగ్నికి - మకరం భూమికి సంకేతం. ధనస్సు రాశివారికి కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఎంత ఆసక్తి ఉంటుందో.. మకర రాశివారికి అంత తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మకరం వారు ఏ విషయాన్ని అంత తొందరగా పాజిటివ్ గా తీసుకోలేరు. ఇద్దరూ వెంటనే రాజీకి వస్తే పర్వాలేదు కానీ లేదంటే ఆ వివాదం ఎక్కడికో వెళ్లిపోతుంది...
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)