Astrology: ప్రపంచాన్ని శాసించే తెలివితేటలు ఈ 5 రాశులవారి సొంతం!
ప్రతి రాశివారిలో ప్రత్యేక లక్షణాలుంటాయి..అయితే ఐదు రాశులవారు మాత్రం పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు..ఏ రేంజ్ అంటే ప్రపంచాన్ని శాసించేంత...ఇందులో మీ రాశి ఉందా...
Zodiac Signs: ఏ ముహర్తాన పుట్టాడో కానీ అనే మాట అంటుంటారు..నిజమే పుట్టిన తిథి, వారం, నక్షత్రం, రాశి ఆధారంగా ఆ వ్యక్తి లక్షణాలు ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ప్రతి వ్యక్తిలో ప్రత్యేకమైన లక్షణాలుంటాయి.. అలా ఈ 5 రాశుల్లో జన్మించిన వారిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయట. వీరిలో మీ రాశి ఉందా మరి!
మేష రాశి ( Aries )
మేషరాశి వారు నిర్భయంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. ఎలాంటి సవాళ్లను అయినా ధైర్యంగా ఎదుర్కోగల సత్తా ఉంటుంది వీరికి. పోటీతత్వం చాలా ఎక్కువ... అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒక్కసారి సంకల్పిస్తే తగ్గేదేలే అన్నట్టుంటారు. అందుకే నాయకులుగా బాగా రాణిస్తారు. అయితే సానుకూల, ప్రతికూల రెండు రకాల నాయకత్వాల్లోనూ వీళ్లను మించినోళ్లు లేరు. హిట్లర్ మేష రాశిలోనే జన్మించాడు..
Also Read: మే నెలలో రెండురాశుల్లో గ్రహాల రాకుమారుడి పరివర్తనం - ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!
సింహ రాశి (Leo)
సూర్యుడు పాలించే సింహరాశివారు నిజంగా పేరుకు తగ్గట్టే సింహం లాంటోళ్లే. ఈ రాశివారిలో సహజంగా నాయకత్వ లక్షణాలుంటాయి. విశ్వాసం, ఎదురులేని అయస్కాంత శక్తి వీరి సొంతం. ఎంతటివారినైనా అప్రయత్నంగా ఆకర్షించేస్తారు. వీరిలో సృజనాత్మకత చాలా ఎక్కువ. వీళ్లని అనుసరించాలని చాలామంది అనుకుంటారు. ప్రపంచాన్ని మార్చేంత ప్రభావం చూపించగలరు. నెపోలియన్ బోనపార్టే , బరాక్ ఒబామా సింహ రాశిలో జన్మించిన వారే...
తులా రాశి (Libra )
తులారాశి వారిది దౌత్యపరమైన , న్యాయమైన స్వభావం. జీవితంలోని అన్ని అంశాలలో సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంలో నిష్ణాతులు. అందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేలా పరిష్కారాలు రూపొందించడంలో ప్రతిభ కలిగి ఉంటారు. ప్రభావవంతైన నాయకత్వానికి కేరాఫ్ తులారాశివారు. స్వాతంత్ర్య ఉద్యమంలో అంహిసాయుతంగా పోరాటం చేసిన గాంధీజీది , మార్గరెట్ థాచర్ వంటి నాయకులది తులా రాశి.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
వృశ్చిక రాశి (Scorpio )
వ్యూహాలు రూపొందించడంలో వృశ్చిక రాశివారిని మించినవారు లేరు. సమస్యలను చూసి పారిపోయే రకం కాదు వీళ్లు..ఎదురెళతారు. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తులు. తమ వ్యక్తిత్వంతో అయస్కాంతంలా అందర్నీ ఆకర్షించేస్తారు. వీరు నాయకులు అని చెప్పుకోరు కానీ అందరి మధ్య ప్రత్యేకంగా నాయకులుగా నిలబడతారు. హిల్లరీ క్లింటన్ , థియోడర్ రూజ్‌వెల్ట్ వంటి నాయకులది వృశ్చిక రాశి.
మకర రాశి (Capricorn )
మకరరాశి వారికి బాధ్యతలెక్కువ. తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రయత్నాలు చేయడంలో వెనుకాడరు. స్థిరమైన మార్గదర్శకత్వం అందించగల సామర్థ్యమే మకరరాశివారిని నాయకులుగా నిలబెడుతుంది. బాధ్యతలు, సవాళ్లను స్వీకరిస్తారు కానీ వెనకడుగు వేయరు.. రిచర్డ్ నిక్సన్ , మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ప్రభావవంతమైన నాయకులు మకరరాశిలో జన్మించినవారే..
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..