అన్వేషించండి

Mercury Transit in Aries and Taurus 2024: మే నెలలో రెండురాశుల్లో గ్రహాల రాకుమారుడి పరివర్తనం - ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!

Mercury Transit 2024: మే నెలలో బుధుడు రెండుసార్లు రాశిమారుతాడు. మే నెల ఆరంభంలో మేష రాశిలోకి...నెలాఖరున వృషభ రాశిలో సంచరిస్తాడు...ఈ సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలనిస్తోంది...

Mercury Transit in Aries and Taurus: ప్రస్తుతం మీన రాశిలో వక్ర దిశలో ఉన్న బుధుడు మే 09 న మేషరాశిలో అడుగుపెడతాడు. మే 28 వరకూ ఇదే రాశిలో ఉండి...ఆ తర్వాత వృషభ రాశిలో అడుగుపెడతాడు. అంటే ఒకే నెలలో రెండుసార్లు రాశి పరివర్తనం చెందుతున్నాడు బుధుడు..అది కూడా 20 రోజుల వ్యత్యాసంలో. ఈ రెండు రాశుల్లో బుధుడి సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తోంది. ముఖ్యంగా మేషం, సింహం సహా ఈ రాశులవారు మే నెలలో మంచి ఫలితాలు పొందుతారు..

మేష రాశి

బుధుడు రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిపోతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు

వృషభ రాశి 

వృషభ రాశివారికి కూడా బుధుడి సంచారం ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని అందిస్తుంది. పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఏదైనా నూతన ఒప్పందాలపై సంతకం చేసేందుకు ఇదే మంచి సమయం. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి జాగ్రత్త...

Also Read: ఈ రాశివారు అతి ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు!

మిథున రాశి

విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులకు మే నెలలో అడుగు ముందుకు పడుతుంది. మీ శక్తితో క్లిష్ట పరిస్థితులను సులభంగా జయిస్తారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి...లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులను నివారించండి. ఆరోగ్యం  జాగ్రత్త

కర్కాటక రాశి

ఉద్యోగం మారాలి అని ఆలోచించే కర్కాటక రాశివారికి మే నెలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఏ విషయంలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. 

సింహ రాశి

బుధుడు మే నెలలో రెండు రాశుల్లో సంచరించడం సింహ రాశివారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకూ తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. సంపద వృద్ధికి కొత్త వనరులు ఏర్పడతాయి. 

Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!

కన్యా రాశి

మే నెలలో బుధుడి రాశి పరివర్తన ప్రభాలం మీకు మిశ్రమ ఫలితాలనిస్తోంది. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యేవరకూ బయటకు మాట్లాడకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

తులా రాశి

తులా రాశివారికి మే నెలలో అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. మేషం, వృషభం ఈ రెండు రాశుల్లో బుధుడి రాశి పరివర్తనం మీకు హోదాని తెచ్చిపెడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థులు, ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 

వృశ్చిక రాశి

మేషం, వృషభ రాశుల్లో బుధుడి సంచారం సమయంలో వృశ్చిక రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రహస్య శత్రులును నివారించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఈ సమయంలో మీ శత్రువులు కూడా సహకారం అందిస్తారు.

ధనుస్సు రాశి

ధనస్సు రాశివారికి మే నెలలో అంత అనుకూల ఫలితాలు లేవు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పులు తీసుకోవద్దు...ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలే సాధిస్తారు. 

Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!

మకర రాశి 

మకర రాశివారికి కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి...

కుంభ రాశి

ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. న్యాయస్థానానికి సంబంధించిన విషయాలను బయటే పరిష్కరించుకోవడం మంచిది. పాత స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

మీన రాశి

బుధుడు సంచారం మీకు అద్భుతంగా కలిసొస్తుంది. ఎక్కడున్నా, ఏపనిలో అయినా మీదే పైచేయి అవుతుంది. గౌరవం పెరుగుతుంది, ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అయినా మీకు అనుకూలంగా మార్చుకోగలరు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Embed widget