Horoscope Today 30th April 2024: ఈ రాశివారు అతి ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు!
Daily Horoscope: ఏప్రిల్ 30 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
Horoscope Today 30th April 2024
మేష రాశి
కార్యాలయంలో మీ పనితీరు అద్బుతంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలకు ఈ రోజు చాలా అనుకూలమైనది. ఇతరుల సమస్యల పరిష్కారానికి మీరిచ్చే సలహాలు ఉపయోగపడతాయి. పాతస్నేహితులను కలుస్తారు. ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
వృషభ రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో సాధారణ ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులుంటాయి. ఉద్యోగులు పనికి తగిన గుర్తింపు పొందుతారు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థిరాస్తి లావాదేవీలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
మిథున రాశి
ఈ రాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో ప్రతికూలత ఉంటుంది. ప్రియమైనవారితో సంబంధాలు మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయాలి.
Also Read: ఈ ఆలయంలో ఉండే విగ్రహాల్లో నిధులకు సంబంధించిన రహస్యాలున్నాయా!
కర్కాటక రాశి
అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి
సింహ రాశి
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో శాశ్వత భాగస్వామ్యం ఉండవచ్చు. పని ఒత్తిడి కారణంగా, మీరు మీ కుటుంబానికి పూర్తి సమయం ఇవ్వలేరు.
కన్యా రాశి
ఈ రాశివారు ఆస్తి కొనుగోలులో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. ప్రతిభను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాలలో బాధ మిగులుతుంది.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
తులా రాశి
ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. రాజకీయ వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది జాగ్రత్త. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి.
వృశ్చిక రాశి
ఈ రాశివారు స్నేహితులు, సన్నిహితుల నుంచి మద్దతు పందుతారు. ఉద్యోగులు కొన్ని పనుల విషయంలో రిస్క్ తీసుకుంటేనే పూర్తవుతాయి. నూతన ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యం,ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. పోషకాహారం తీసుకోవాలి. మీ సామర్థ్యానికి తగిన ప్రశంసలు అందుతాయి. గొప్ప వ్యక్తుల సహవాసం లభిస్తుంది. కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
మకర రాశి
వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఈ రోజు అనుకూలం. ఆర్థిక లాభాలు పొందుతారు. వివాదాస్పద విషయాలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ అవసరాలు తీర్చడంలో బిజీగా ఉంటారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు.
కుంభం రాశి
ఏదో టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతుంది..తప్పుడు మార్గంలో వెళ్లాలనే ఆలోచనకు చెక్ పెట్టేయడం మంచిది. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కొంతకాలం వాయిదా వేసుకోవాలి.
మీన రాశి
ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు. మీ ప్రవర్తన అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...