Gajakesari Raja Yoga Effect: గజకేశరి మహా రాజయోగం..ఫిబ్రవరిలో ఈ 5 రాశులవారికి మహా యోగం!
Astrology: గజకేశరి మహా రాజయోగం ఫలితంగా వారం పాటు నాలుగు రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. ఫిబ్రవరి 10 వరకూ ఈ రాశులవారికి యోగమే...

Gajakesari Raja Yoga : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశులు పరివర్తనం చెందే ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశుల వారిపైనా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల కలయిక వల్ల యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు శక్తివంతమైన గజకేశరి రాజయోగం వల్ల వృషభం, మిథునం, సింహం, తులా , ధనస్సు రాశులవారికి మంచి యోగం ఉంది. ఇప్పటివరకూ వెంటాడిన సమస్యలు తీరిపోతాయి. ఈ యోగం ఉన్నప్పుడు ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వృత్తి , వైవాహిక, ప్రేమ జీవితాల్లో కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఈ యోగంతో అదృష్టం కలిసొచ్చే రాశులివే...
వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టే ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also Read: షోడశోపచారాలు అంటే ఏంటి..నిత్యం పూజలో భాగంగా ఇవన్నీ అనుసరించాలా!
మిథున రాశి (Gemini)
ఈ రాశివారు శుభవార్తలు వింటారు. అదృష్టం కలిసొస్తుంది. వారం మధ్యలో సంతోషంగా ఉంటారు. కెరీర్ కి సంబంధించిన సమస్యలుంటే అవి తీరిపోతాయి. మీపై మీకు విశ్వాసం పెరుగుతంది. వ్యాపారం విస్తరించే ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు.
సింహ రాశి (Leo)
గజకేశరి రాజయోగం వల్ల ఫిబ్రవరి నెలలో సింహ రాశివారికి కలిసొస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం కోసం వెతుకున్నవారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ముగిసిపోతాయి. వైవాహిక జీవతం సంతోషంగా ఉంటుంది
Also Read: ఫిబ్రవరి ఆరంభం నుంచి ఏప్రిల్ 18 వరకూ ఈ 4 రాశులవారిపై శని తీవ్ర ప్రభావం!
తులా రాశి (Libra)
తులా రాశి వారికి గజకేశరి రాజయోగం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఇది శుభసమయం. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనస్సు రాశి (Sagittarius)
ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుంది. నూతన పెట్టుబడులు ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కెరీర్ గురించి నూతన ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి సమయం కలిసొస్తుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

