అన్వేషించండి

అక్టోబరు 09 రాశిఫలాలు - ఈ రాశులవారు బలహీనతలను అధిగమించాల్సిన సమయం ఇది!

Horoscope Prediction 9th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 9th October 2024 

మేష రాశి

పాత ఆలోచనలను విడిచిపెట్టేసి కొత్తగా ఆలోచించడం ప్రారంభించండి. కెరీర్ విషయంలో రిస్క్ తీసుకోవాల్సిన సమయం ఇది. సన్నిహిత సంబంధాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావొచ్చు. ప్రయాణాల్లో సమస్యలు తలెత్తుతాయి. 

వృషభ రాశి

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులపై సంతకం చేసేముందు మరోసారి ఆలోచించండి. ఇతరుల వివాదాల్లో తలదూర్చొద్దు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

మిథున రాశి

ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. 

Also Read: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి!

కర్కాటక రాశి

ఈ రాశివారు కుటుంబ సభ్యుల గురించి ఆందోళనం చెందుతారు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకుంటారు. వివాదాల్లో మీరు మధ్యవర్తిత్వం వహించవద్దు. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులతో కలసి లాంగ్ టూర్ ప్లాన్ చేసుకుంటారు. 

సింహ రాశి

ఈ రాశివారు ఆలోచనల్లో కొత్తదనం ఉంటుంది కానీ మీరు చెప్పిన మాటలు ఎవ్వరూ అంగీకరించలేరు. నూతన పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. బాధ్యతలు పెరుగుతాయి. 

కన్యా రాశి

మీరు అనుకోని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.  ఆరోగ్య సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోవద్దు. సరైన నిద్రఅవసరం..ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారాలు బాగానే సాగుతాయి. మనసులో ఉత్సాహం తగ్గుతుంది. 

తులా రాశి

కొత్త అధ్యయనాలపై ఆసక్తి చూపిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్లాన్ చేసుకుంటారు. సహోద్యోగుల నుంచి సరైన సమయంలో సహకారం అందుతుంది.  కుటుంబ పనుల్లో బిజీగా బిజీగా ఉంటారు.  

వృశ్చిక రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆందోళన పెరుగుతాయి.  తాత్విక ఆలోచనల ప్రభావంలో ఉండవచ్చు. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య రావచ్చు. సన్నిహిత వ్యక్తి గురించి కొంత ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో గొడవలు ఉండవచ్చు. 

Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!

ధనస్సు రాశి

నూతన వ్యాపారానికి సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఎవరి పట్లా దురుద్దేశాలు పెట్టుకోవద్దు. శారీరక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సామాజిక చర్చలలో పాల్గొంటారు. 
 
మకర రాశి

ఈ రోజు నూతన  పనిని ప్రారంభించవద్దు. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమఫలితాలుంటాయి. ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించండి. 

కుంభ రాశి

ఈ రోజు మీ శత్రువులు యాక్టివ్ గా మారుతారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. కుటుంబంతో మంచి సమయాన్ని స్పెండ్ చేస్తారు.  మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. తెలియని వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

మీన రాశి

మీ బలహీనతలపై శ్రద్ధ వహించండి..వాటినుంచి బయటపడేందుకు ప్రయత్నించడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది.

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Embed widget