అన్వేషించండి

అక్టోబరు 04 రాశిఫలాలు - ఇతరుల విషయాలపై ఈ రాశులవారికి మహా ఆసక్తి!

Horoscope Prediction 4rd October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 4th October 2024

మేష రాశి

ఈ రోజు సామాజిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇంట్లో ఏదో ఒక విషయంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది.

వృషభ రాశి

స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.  మీ ప్రతిభపై నమ్మకం ఉంచండి. రానిబాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

మిథున రాశి

ఈ రోజు మీరు మీ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కొత్తదనం కోరుకుంటారు. రాజకీయ విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారంలో నష్టపోయే అవకాశాలున్నాయి. అప్పులు చేయొద్దు. మీ సన్నిహితులు మీపై కోపంగా ఉంటారు. 

కర్కాటక రాశి

ఈ రోజు సమయానికి డబ్బు చేతికందకపోవడం వల్ల మీ పని ప్రభావితం అవుతుంది. ప్రేమికుల విషయంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. మీ లక్ష్యంపై పూర్తి దృష్టిపెట్టండి. మీరున్న రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. 
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

సింహ రాశి

ఈ రోజు చాలా గొప్పగా ప్రారంభం అవుతుంది. కొత్త పనుల్లో తలెత్తిన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం. పాత గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది జాగ్రత్త. 

కన్యా రాశి

మీ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తికావు. వాహన నిర్వహణకు డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. అధికారులు మీ పట్ల మంచిగా ప్రవర్తిస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో మీరు ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది.  విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

తులా రాశి

కెరీర్ సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మేధో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.  వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 
 
వృశ్చిక రాశి

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఏదో విషయంలో అవమానంగా భావిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది. చేసే పనిలో పొరపాటు దొర్లుతుంది. 

ధనస్సు రాశి

ఈ రోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మిత్రులతో చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

మకర రాశి

మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి.  ఇంట్లో, కార్యాలయంలోనూ పనితో బిజీగా ఉంటారు. తెలియని వ్యక్తులతో అనవసర చర్చలు పెట్టుకోవద్దు. రోజు బాగానే గడుస్తుంది. 

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!

కుంభ రాశి

ఇతరుల విషయాలపై అధిక ఆసక్తి ప్రదర్శించవద్దు. కెరీర్ ని వృద్ధి చేసుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకుంటారు.  న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు లాభపడతారు. 

మీన రాశి

చెడు సహవాసాలు ఏర్పడతాయి. తప్పుడు అలవాట్ల వల్ల విమర్శలు ఎదుర్కొంటారు. మీ వ్యక్తిగత జీవితంలో ఉండే రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Embed widget