1 November 2022 Daily Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవద్దు, నవంబరు 1 రాశిఫలాలు
Horoscope Today 1st November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 1st November 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. అతిగా ఆలోచించేబదులు కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించండి. మీలో కొందరు ప్రేమ సంబంధాల వైపు మళ్లితే..మరికొందరు కుటుంబ సంబంధాలవైపు వెళతాడు. మీకు ఈ రోజు కలిసొచ్చే రంగు ఎరుపు
వృషభ రాశి
ఈ రాశి వ్యాపారులకు చాలా కాలం తర్వాత వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. విధినిర్వహణలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయం మీకు అనుకూలంగా ఉంది...ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు మీ మనస్సులో ఉన్న ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక పరంగా ఆసక్తి ప్రదర్శిస్తారు. ఉరకల పరుగుల జీవితం నుంచి బయటకు వచ్చి మీకంటూ స్వతంత్ర జీవితాన్ని చూడడానికి ఇది అనుకూల సమయం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు పసుపు.
Also Read: కార్తీకమాసం నెలరోజులూ తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!
కర్కాటక రాశి
మీరు ఆత్మపరిశీలన చేసుకునే స్థితిలో ఉంటారు. కొంతకాలంగా పడుతున్న కష్టానికి వచ్చిన ఫలితం చూసి మీ మనస్సు అలసిపోతుంది. ఈ రోజు నడడకు వెళ్లడం, మీ మనస్సును కాస్త ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. ఓ పుస్తకం చదవండి ప్రశాంతత లభిస్తుంది. మీకు ఈ రోజు కలిసొచ్చే రంగు తెలుపు.
సింహ రాశి
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ముందుకు సాగడానికి మంచి చెడు విషయాలను గ్రహించంండి. ఒకసారి మాట్లాడిన పదాలు తిరిగి రాలేనట్లే, మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి వెళ్ళలేవు. కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఊదారంగు ధరించండి.
కన్యా రాశి
మీరు మీ ప్రతిష్టాత్మక స్వభావం నుంచి ప్రేరణ పొందుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు మంచి రోజు. మీ లక్ష్యాలను ఉన్నతంగా ఉంచుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైలెట్ రంగు మీకు మంచిది.
Also Read: ఈ రాశులవారు సంయమనంతో ఉంటారు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోరు
తులా రాశి
గడిచిన ఎన్నో సంఘటనలు గుర్తుచేసుకుంటారు. కుటుంబంలో శాంతి,సంతోషం ఉంటుంది. మీ సక్సెస్ వల్ల మీ కీర్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయి, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న సాధారణ ఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొంటారు. ఈ రోజు మీరు ప్రశాంతమైన, హేతుబద్ధమైన మనస్సుతో గెలుస్తారు...పరస్పర అంగీకారంతో ఒక పరిష్కారాన్ని పొందుతారు. ఈ రోజు మీకు సానుకూల శక్తినిచ్చే రంగు క్రీమ్.
ధనుస్సు రాశి
మీ చుట్టూ ఉన్న బాధ్యతల్లో మునిగిపోతారు. ఇది మిమ్మల్ని కలవరపెడుతుంది కానీ ఆలోచనను ప్రతికూలత వైపు మళ్లనీయొద్దు. సానుకూల ఆలోచనలు మాత్రమే అద్భుతాలు చేయగలవని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు విశ్వసించాలి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం లేత పసుపు రంగు ఈ రోజు మీకు మంచిది.
మకర రాశి
మీ ఆలోచనలను మార్చుకోండి. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకపోవడం సముచితం. పోటీ పరీక్షలు రాసేందుకు ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. తండ్రితో వివాదం ఉండొచ్చు. కోపగించుకోకపోవడం సముచితం.
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశివారు అన్ని సమస్యలను మరచిపోయి సంతోషాన్ని కలిగించే విషయాల వైపు అడుగేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎరుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోవద్దు.
మీన రాశి
రోజంతా సరదాగా ఉంటారు. ఏదో ఆశ్చర్యకరమైన విషయం మీ కోసం వేచి ఉంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ ప్రయాణం మీకు ముఖ్యమైనదిగా రుజువు చేస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఈ రోజు మీకు మెరూన్ కలర్ సానుకూల ఫలితాలు ఇస్తుంది.